పోరాటవీరుల త్యాగఫలం..స్వాతంత్య్రం

ABN , First Publish Date - 2022-08-15T04:55:04+05:30 IST

నాటి పోరా ట వీరుల త్యాగఫలితమే నేడు స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామని పోర్డు సంస్థ సీఈవో లలితమ్మ పేర్కొన్నారు.

పోరాటవీరుల త్యాగఫలం..స్వాతంత్య్రం
మదనపల్లె గురుకుల పాఠశాలలో 75 వసంతాల ఇండిపెండెన్స్‌ రూపంలో కూర్చొని ప్రదర్శన చేస్తున్న విద్యార్థినులు

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 14: నాటి పోరా ట వీరుల త్యాగఫలితమే నేడు స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామని పోర్డు సంస్థ సీఈవో లలితమ్మ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక చంద్రాకాలనిలోని ప్రభుత్వ గురు కుల పాఠశాలో పోర్డు ఆధ్వర్యంలో ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా  75ఏళ్లు ఇండిపెండెన్స్‌ అక్షర రూపంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సి పాల్‌ కన్యాకుమారి, పోర్డు సిబ్బంది పాల్గొ న్నారు. స్థానిక ప్రభుత్వ బాలసదన్‌లో  ఆజా దికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా చిన్నా రులకు డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. బాలసదన్‌ సూపరింటెండెంట్‌ ఉమా రాణి, విజయ తదితరులు పాల్గొన్నారు.

పీలేరులో డిగ్రీ విద్యార్థుల 5కె రన్‌ 

పీలేరు, ఆగస్టు 14: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పీలేరులోని సంజ య్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యా ర్థు లు ఆదివారం పట్టణంలో 5కె రన్‌ నిర్వ హిం చారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. 

పెద్దతిప్పసముద్రంలో:అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా స్థానిక పీటీఎంలో వెలుగు ఏపీఎం సాంబశివ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో  ప్రతి ఒక్కరు వారి ఇంటి మీద జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సంఘ మిత్రలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. 

ములకలచెరువులో: మండలంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా  వేపూ రికోటలో శ్రీ వెంటేశ్వర పాఠశాల ముందు దేశ చిత్ర పటం ఏర్పాటు చేశా రు. రంగులు, చిరుధాన్యాలతో మొలచిన మొక్కలతో అద్భు తంగా రూపొందించారు. 

మదనపల్లె అర్బన్‌లో: పట్టణంలో నీరుగ ట్టువారిపల్లెలో చౌడేశ్వరీదేవి ఆలయం వద్ద ఆదివారం ఆలయకమిటీ అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర ఆధ్వర్యంలో ఆజా దీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జాతీయ  జెండా ఎరుగరవేశారు. అనంతరం  మిఠాయిలు పంచి పెట్టారు.  కార్యక్రమంలో ఆలయ కమి టీ సెక్రటరీ గుండ్లపల్లె ప్రభాకర్‌, ట్రెజరర్‌ రామిశెట్టి లోకేష్‌, కమిటీ సభ్యులు, కౌన్సిలర్‌ రమణ, తొగటక్షత్రియ కులభాంధవులు ప్రెస్‌ రమణ, నీలకంఠ,  చంద్రశేఖర్‌, సత్య, బీజేపీ వెంకటేష్‌, చంద్రశేఖర్‌, ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకటరత్నం నాగరాజ పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-15T04:55:04+05:30 IST