స్వాతంత్ర్యోద్యమానికి దారిచూపిన రష్యా విప్లవం

ABN , First Publish Date - 2022-01-22T06:24:00+05:30 IST

భారతదేశ స్వాతంత్రోద్యమానికి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి లెనిన నాయకత్వంలో జరిగిన రష్యా విప్లవం మార్గం చూపిందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ స భ్యుడు మేక అశోక్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు జల్లెల పెంటయ్య అన్నారు.

స్వాతంత్ర్యోద్యమానికి దారిచూపిన రష్యా విప్లవం
రామన్నపేట: లెనిన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు

రామన్నపేట, జనవరి 21: భారతదేశ స్వాతంత్రోద్యమానికి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి లెనిన నాయకత్వంలో జరిగిన రష్యా విప్లవం మార్గం చూపిందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ స భ్యుడు మేక అశోక్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు జల్లెల పెంటయ్య అన్నారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆచరించి చూపి ప్రపంచానికి దిశా నిర్ధేశం చేసిన ప్రపంచ కమ్యూనిస్టు విప్లవకారుడు లెనిన అని కొనియాడారు. స్థానిక పార్టీ కార్యాలయంలో లెనిన 98వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో శ్రమ దోపిడీ నూతనత్వాన్ని సంతరిచుకుని సంపద పోగేసుకుంటున్న సమయంలో లెనిన చూపిన మార్గంలో పోరాటాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, నాయకులు గాదె నరెందర్‌, బోయిని ఆనంద్‌, కల్లూరి నగేష్‌, గన్నెబోయిన విజయభాస్కర్‌, మెట్టు శ్రవణ్‌, గుండాల భిక్షం, గుండాల నరేష్‌, దండిగ వెంకన్న పాల్గొన్నారు. 

ఆలేరు: లెనిన స్ఫూర్తితో యువకులు సమసమాజ స్థాపన కోసం ఉద్యమించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ.ఎక్బాల్‌, మండల కార్యదర్శి దూపటి వెంకటేశ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో లెనిన చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.   కార్యక్రమంలో నాయకులు నల్లమాస తులసయ్య, వడ్డెమాను శ్రీనివాస్‌, చెన్న రాజేశ, ఎం.అజయ్‌, కాసుల నరేశ, భువనగిరి గణేశ, గ్యార భాస్కర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T06:24:00+05:30 IST