Abn logo
Sep 26 2021 @ 00:49AM

అధికార పార్టీ అరాచకాలను నిలదీస్తా

జడ్పీటీసీ రమణమ్మ

 నర్సీపట్నం జడ్పీటీసీ రమణమ్మ

విశాఖపట్నం, సెప్టెం బరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పరిషత్‌ సమావేశాలల్లో అధికార పార్టీ చేసిన తప్పుడు  పనులు, అరాచకాలను నిలదీ స్తానని నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ అన్నారు. శనివారం విశాఖలో  జడ్పీటీసీగా ప్రమాణం స్వీకా రం చేసిన అనంతరం మాట్లా డారు. గతంలో ఎంపీపీగా పనిచేసినప్పుడు జడ్పీలో పలు అంశాలపై ప్రస్తావించే అనుభవం తనకు ఉందన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గళం విప్పుతానని చెప్పారు. ఈ పర్యాయం టీడీపీ నుంచి తాను ఒక్కర్నే ఎన్నికైనప్పటికీ తమ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆశీస్సులతో ప్రతి అంశంపై చర్చించి, సమావేశంలో ప్రస్తావిస్తానని వెల్లడించారు.