ఈ నిశ్చితార్థ వేడుకలో విందు భోజనం చేయొచ్చు.. అయితే షరతులు వర్తిస్తాయి.. వధూవరుల వినూత్న నిబంధన..

ABN , First Publish Date - 2022-01-24T02:32:38+05:30 IST

చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో భారీగా ఖర్చు చేసి విందు భోజనం ఏర్పాటు చేశారు. అయితే భోజనం చేయాలంటే మాత్రం.. కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని వధూవరులు కండీషన్ పెట్టారు...

ఈ నిశ్చితార్థ వేడుకలో విందు భోజనం చేయొచ్చు.. అయితే షరతులు వర్తిస్తాయి.. వధూవరుల వినూత్న నిబంధన..

వివాహ వేడుకలో విందు భోజనాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారి వారి స్థాయిని బట్టి బంధువులు, సన్నిహితులకు భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. చిన్న వేడుకైనా, పెద్ద వేడుకైనా పసందైన విందుభోజనం మాత్రం పక్కాగా ఉంటుంది. చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో భారీగా ఖర్చు చేసి విందు భోజనం ఏర్పాటు చేశారు. అయితే భోజనం చేయాలంటే మాత్రం.. కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని వధూవరులు కండీషన్ పెట్టారు. పెళ్లిలో కండీషన్లు పెట్టడం బాధగా ఉన్నా.. విధిలేని పరిస్థితుల్లో కొన్ని షరతులు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతకీ విషయం ఏంటంటే.. 


చెన్నై శివారులోని పూనమలిలోని కల్యాణమండపంలో ఇటీవల మేరీ, వివేక్‌ దంపతుల నిశ్చితార్థం జరిగింది. భారీగా ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేశారు. అలాగే వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేయించారు. వేడుకకు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు. తీరా భోజనం చేద్దామనుకున్న సమయంలో వధూవరుల నిబంధనలు విని అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. రెండు సార్లు వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లు సర్టిఫికెట్లతో పాటూ మాస్కులు పెట్టుకున్నవారికే బిరియానీ వడ్డించండి అంటూ నిబంధన పెట్టారు.

కార్ల షోరూంలో రైతుకు అవమానం.. దాంతో చివరకు షోరూం వారికి ఎలా బుద్ధి చెప్పాడో తెలిస్తే.. శభాష్ అనకుండా ఉండలేరు!


వైద్యులైతే విధిగా డబుల్ మాస్కులు పెట్టుకోవాలని చెప్పారు. అతిథులకు నిబంధనలు పెట్టడంతో పాటూ వధూవరులు కూడా కరోనా నిబంధనలు పాటించారు. అంతటితో ఆగకుండా పూలదండలకు బదులుగా మాస్కులతో చేసిన దండలను మార్చుకోవడం అక్కడున్న వారందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఇదిలావుండగా, వీరి నిబంధన తెలుసుకుని కొందరు మొఖం చిట్లించుకోగా, చాలా మంది అభినందించారు. ఈ వార్త వైరల్ అవడంతో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతా ఇలాగే ఆలోచించాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

టాయిలెట్‌ నుంచి శబ్ధాలు వస్తున్నాయని పక్కింటి వారిపై కోర్టులో కేసు.. 19 ఏళ్ల తర్వాత ఎలాంటి తీర్పు వచ్చిందో తెలుసా..

Updated Date - 2022-01-24T02:32:38+05:30 IST