నిబంధనలు పాటించాల్సిందే

ABN , First Publish Date - 2021-05-17T04:54:39+05:30 IST

జిల్లాలో కరోనా సెకెండ్‌ వేవ్‌ నియంత్రణలో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యం, ఇతర అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు.

నిబంధనలు పాటించాల్సిందే
ఎస్పీ రాజకుమారి

పట్టించుకోనివారిపై 91 కేసులు

ఎస్పీ రాజకుమారి 

విజయనగరం క్రైం, మే 16: జిల్లాలో కరోనా సెకెండ్‌ వేవ్‌ నియంత్రణలో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యం, ఇతర అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు. బయట తిరిగేవారు సరైన ఆధారాలు, కారణాలు చూపకపోతే కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినట్టుగా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించిన 188 మందిపై 91 కేసులు నమోదు చేసి 2 లక్షల 72 వేల 830 రూపాయల అపరాధ రుసుం విధించామన్నారు. మాస్క్‌లు ధరించకుండా పబ్లిక్‌ ప్రదేశాల్లో సంచరిస్తున్న వారిపై లక్షా 23 వేల 219 కేసులు నమోదు చేసి 98 లక్షల 88 వేల 740 అపరాధ రుసుం విధించామన్నారు. జిల్లా కేంద్రంలో వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐలు మురళీ, సీహెచ్‌ శ్రీనివాసరావు, సిబ్బంది ఆదివారం కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు. 


Updated Date - 2021-05-17T04:54:39+05:30 IST