అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా

ABN , First Publish Date - 2022-08-19T05:20:25+05:30 IST

మండలంలోని పుట్టకనుమ ఘాట్‌ వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తాపడి పలువురు గాయపడ్డారు. పేరూరు గ్రామం నుంచి ఏపీ 29జడ్‌ 2537 ఆర్టీసీ బస్సు దాదాపు 60మంది ప్రయాణికులతో అనంతపురం బయల్దేరింది.

అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా
బోల్తాపడిన ఆర్టీసీ బస్సు

ఏడుగురికి తీవ్ర గాయాలు..  పుట్టకనుమ ఘాట్‌వద్ద ప్రమాదం 

కనగానపల్లి, ఆగస్టు18: మండలంలోని పుట్టకనుమ ఘాట్‌ వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తాపడి పలువురు గాయపడ్డారు. పేరూరు గ్రామం నుంచి ఏపీ 29జడ్‌ 2537 ఆర్టీసీ బస్సు దాదాపు 60మంది ప్రయాణికులతో అనంతపురం బయల్దేరింది. మార్గమధ్యంలోని పుట్టకనుమ ఘాట్‌ వద్ద అకస్మాత్తుగా  గొర్రెల మంద అడ్డు వచ్చింది. దీంతో బస్సును మరో పక్క కు తిప్పితే కోతకు గురైన రోడ్డు లోయలాగా ఉండటంతో డ్రైవర్‌ శ్రీనివాసులు చాకచక్యంగా బస్సును కదిలించి ఓ పెద్ద బండరాయికి ఢీకొన్నాడు. ఘాట్‌ రోడ్డు కావడంతో బస్సు అదుపుకాక బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పేరూరుకు చెందిన రాజమ్మ, ఓబులమ్మ, కైరునబీ, దుబ్బరపల్లి రామలక్ష్మి, వేపకుంట లక్ష్మక్క, అనంతపురానికి చెందిన భాగ్యలక్ష్మితో పాటు మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీరితో పాటు మరో పదిమంది స్వల్పంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వారు  బస్సులో ఇరుక్కు వారిని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించా రు. కనగానపల్లి ఎస్‌ఐ ఆంజనేయులు సిబ్బందితో వెళ్లి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తీయించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  



Updated Date - 2022-08-19T05:20:25+05:30 IST