May 6 2021 @ 14:58PM

కోవిడ్ నిర్మూలనలో భాగం కావాలంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ విజ్ఞప్తి

కోవిడ్ సెకండ్ వేవ్ రోజురోజుకి విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దీని నిర్మూలనలో భాగం కావాలంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. పాన్ ఇండియన్ స్థాయిలో ప్రతీ ఒక్కరికీ ఈ సమాచారం అందేలా అర్థమయ్యేలా సౌత్ అండ్ నార్త్ ప్రధాన భాషల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ విజ్ఞప్తి చేయడం విశేషం. తెలుగులో ఆలియాభట్, తమిళంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, కన్నడలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మలయాళంలో దర్శకుడు రాజమౌళి హిందీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తాజా వీడియోలో మాట్లాడారు. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని..దీని బారిన పడకుండా ఉండాలంటే మనకున్న ఆయుధాలు మాస్క్, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని ఆర్ఆర్ఆర్ టీమ్ కోరారు.