Abn logo
Oct 18 2021 @ 00:40AM

కుటుంబంలో స్త్రీ పాత్ర విశిష్టమైనది

మాట్లాడుతున్న అప్పాల ప్రసాద్‌

- సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌  అప్పాల ప్రసాద్‌

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 17: కుటుంబంలో స్త్రీ పాత్ర  చాలా విశిష్టమైనదని సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం అశోక్‌నగర్‌ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో కుటుంబం-సమరసత అంశం అనే అంశంపై కుటుంబాలతో సమ్మేళనం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మఖ్య అతిథిగా హాజరై అప్పాల ప్రసాద్‌ మాట్లాడారు. కాలక్రమేణ కుటుం బాలు సమాజంలో వస్తున్న మార్పులు మన పిల్లలు, దేశంపై ప్రభావం పడుతుందన్నారు.  కుటుంబంలో స్త్రీ పాత్ర అత్యంత విశిష్టమైందని, స్త్రీ  పొదుపుతోనే ఈ దేశ ఆర్థి వ్యవస్థ ఆధారపడుతుం దన్నారు. మహిళలకి సాధికారత ఉంటే అన్ని సాధి స్తారన్నారు. కుటుంబంలో, సమాజంలో సమరసత ఉంటే ఈ దేశం సౌభాగ్యవంతంగా, సుభిక్షం అవు తుందన్నారు. దేశ సమగ్రత సమైక్యత కుటుంబ సమాజ సమరసతపై ఆధారపడి ఉందన్నారు.  కార్యమ్రంలో సామాజిక సమరసత కుటుంబ ప్రభో ధ ప్రముఖ్‌ రాపెల్లి ముకుందం, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రము ఖ్‌ కిరణ్‌, సామాజిక సమరసత వేదిక జిల్లా కన్వీన ర్‌ మోర శ్రీనివాస్‌, వార్డు కౌన్సిలర్‌ గూడూరి భాస్కర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌, సామాజిక సమరసత వేదిక, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నా యకులు అన్నల్‌దాస్‌ వేణు, గాజుల వేణు, రమేష్‌, రవి, రాంప్రసాద్‌, శ్రీధర్‌, మహిళలు, పాల్గొన్నారు.