గ్రామాభివృద్ధిలో వలంటీర్ల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-04-13T06:08:56+05:30 IST

గ్రామాభివృద్ధిలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధిలో వలంటీర్ల పాత్ర కీలకం
దివ్యాంగ వలంటీర్‌ను సత్కరిస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తదితరులు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఆనందపురం, ఏప్రిల్‌ 12: గ్రామాభివృద్ధిలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో వలంటీర్ల సేవలకు సత్కార కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. వీటిని ప్రజలకు చేరువ చేసి బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే వలంటీర్ల వ్యవస్థతోనే సాధ్యమవు తుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి విజయం సాధించారన్నారు. దీంతో ఈ పథకం ఇత ర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందన్నారు. వలంటీర్లు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు వారిని గౌరవిస్తూ సత్కరిస్తున్నామన్నారు. 

కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ మాట్లాడుతూ పారదర్శకంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరికీ పథకాలు అందడానికి వలంటీర్లే కారణమన్నారు. గ్రామ సచివాలయాలకు, ప్రజలకు వలంటీర్‌ అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నాడని, కొవిడ్‌ సమయంలో కూడా వారి సేవలు మరువలేనివన్నారు. జిల్లాలో 22,376 మంది వలం టీర్లు పని చేస్తుండగా 19,600 మందికి పలు కేటగిరీ లలో బహుమతులు అందిస్తున్నామన్నారు. అనంత రం వలంటీర్లను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ అరుణ్‌బాబు, జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్‌, ఎంపీడీవోలు లవరాజు, చిట్టిరాజు, నాయకులు కోరాడ వెంకటరావు, మజ్జి వెంకటరావు, బంక సత్యనారాయణ, సుంకరి గిరిబాబు, కంటుభుక్త రామునాయుడు పాల్గొన్నారు.


సేవా వారధులు.. 

కొమ్మాది: సేవా దృక్పథంలో వలంటీర్లు ప్రజలకు సేవ చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. సోమవారం చంద్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవలందించిన భీమిలి నియోజకవర్గానికి చెందిన వార్డు వలంటీర్లను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. వలంటీర్లంతా ప్రజలతో మమేకమై అత్యుత్తమ సేవలందిస్తూ ప్రతి కుటుంబంలోనూ సొంత మనిషిలా మారారన్నారు. కరోనా ఉధృతి సమయంలోనూ విశేష సేవలందిస్తున్నారన్నారు. వారి సేవలను గుర్తించి వలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవావజ్రగా మూడు కేటగిరిల్లో అవార్డులు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, కమిషనర్‌ డాక్టర్‌ సృజన, జేసీ అరుణ్‌బాబు, డిప్యూటీ మేయర్‌ జియానిఇ శ్రీధర్‌, జోన్‌-2 జెడ్సీ బి.రాము, పిళ్లా సుజాత, మొల్లి హేమలత, పిళ్లా మంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T06:08:56+05:30 IST