దేశ రక్షణలో పోలీసుల పాత్ర కీలకం : ఎస్పీ

ABN , First Publish Date - 2022-05-22T06:53:23+05:30 IST

దేశ రక్షణలో తెలంగాణ పోలీసుల పాత్ర ఎంతో కీలకమైందని జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వాటర్‌లో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు. భారతీయులమైన మేము మా దేశ అహింస, సహనం సాంప్రదాయాన్ని ధృడంగా విశ్వసిస్తామని

దేశ రక్షణలో పోలీసుల పాత్ర  కీలకం : ఎస్పీ
తీవ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్పీ

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 21: దేశ రక్షణలో తెలంగాణ పోలీసుల పాత్ర ఎంతో కీలకమైందని జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వాటర్‌లో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు. భారతీయులమైన మేము మా దేశ అహింస, సహనం సాంప్రదాయాన్ని ధృడంగా విశ్వసిస్తామని, మేము అన్ని రకాల ఉగ్రవాదం, హింసను గట్టిగా వ్యతిరేకిస్తామని, విధ్వంసుల శక్తులకు వ్యతిరేకం గా పోరాడాలని మేము ప్రమాణం చేస్తున్నామని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతియేటా మే 21ని తీవ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తామన్నారు. జాతీయ ప్రయోజనలకు ఉగ్రవాదం ఎంతో వ్యతిరేకమని దీని వల్ల కలిగే హింసా మార్గం నుంచి యువతను దూరం చేసేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఏఆర్‌ డీఎస్పీ విజయ్‌కుమార్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు బి.శ్రీపాల్‌, ఎం.వంశీకృష్ణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T06:53:23+05:30 IST