సమాజాభివృద్ధిలో కవుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2022-08-17T03:54:31+05:30 IST

సమాజంలో కవుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం వజ్రోత్సవాలు-దేశభక్తి అనే అంశంపై జిల్లా కేంద్రంలోని సైన్స్‌ సెంటర్‌లో నిర్వహించిన కవి సమ్మేళనంలో మాట్లాడారు. భరత మాత చిత్రపటా నికి పూల మాల వేసి సమ్మేళనాన్ని ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి ప్రారంభించారు.

సమాజాభివృద్ధిలో కవుల పాత్ర కీలకం
కవి సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

ఏసీసీ, ఆగస్టు 16: సమాజంలో కవుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం వజ్రోత్సవాలు-దేశభక్తి అనే అంశంపై జిల్లా కేంద్రంలోని సైన్స్‌ సెంటర్‌లో నిర్వహించిన కవి సమ్మేళనంలో మాట్లాడారు. భరత మాత చిత్రపటా నికి పూల మాల వేసి సమ్మేళనాన్ని ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి ప్రారంభించారు. జిల్లాకు చెందిన పలువురు కవులు వజ్రోత్సవా ల ప్రాధాన్యం, స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల జీవితం, మహాత్మాగాంధీ స్ఫూర్తి, దేశ నాయకులను స్మరిస్తూ వినిపించిన కవితలు  అలరించాయి. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ కవులు రాళ్లను సైతం కరిగించే సృజనశీలులని కొనియాడారు. డీఈవో మాట్లాడుతూ 75 మంది కవులు కవి సమ్మేళనంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. సమన్వయకర్తగా  యోగేశ్వ ర్‌, నిర్వాహకులుగా శ్రీనివాస్‌, అల్లాడి శ్రీనివాస్‌, శ్రీనివాసవర్మ వ్యవహరించారు. 

 

Updated Date - 2022-08-17T03:54:31+05:30 IST