రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-02-27T04:33:26+05:30 IST

రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
విఠల్‌ను సన్మానిస్తున్న ఉద్యోగ సంఘం నేతలు

టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్‌

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : రాష్ట్రాభివృద్ధిలో పంచాయతీరాజ్‌ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని తెలంగాణ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక చైర్మన్‌, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు చింతలగట్టు విఠల్‌ అన్నారు. వికారాబాద్‌లోని జడ్పీ హాలులో శుక్రవారం జరిగిన తెలంగాణ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టీపీఆర్‌ఎంఈఏ) జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పంచాయతీరాజ్‌ ఉద్యోగుల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసే అవకాశం పంచాయతీరాజ్‌ ఉద్యోగులకే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పంచాయతీరాజ్‌ మినిస్ట్రీరియల్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామన్నారు. పర్యవేక్షకులకు గజిటెడ్‌ హోదా కల్పించడంతో పాటు టైపిస్టులను కంప్యూటర్‌ ఆపరేటర్లుగా హోదా మార్చే అంశాలపై ఎన్నికల కోడ్‌ అనంతరం ప్రతినిధుల బృందాన్ని సీఎం వద్దకు తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. విఠల్‌తో పాటు అసోసియేషన్‌ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి ఆకుల నందకుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, వీడీడీఎఫ్‌ వ్యవస్థాపక సభ్యుడు శ్రీనివాస్‌, టీపీఆర్‌ఎంఈఏ  అసోసియేట్‌ అధ్యక్షుడు చెన్నారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి అనంతరావు, కోశాధికారి ప్రభు, అమర్‌శెట్టి, అజయ్‌కుమార్‌, శివకుమార్‌, శివానంద్‌, మన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:33:26+05:30 IST