స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్‌ పాత్ర కీలకం

ABN , First Publish Date - 2022-08-14T05:15:04+05:30 IST

స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్‌ పాత్ర ఎంతో ఉందని మక్తల్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు వాకిటి శ్రీహరి, రాజుల ఆశిరెడ్డి అన్నారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్‌ పాత్ర కీలకం
ఓబ్లాపూర్‌ గ్రామంలోకి ప్రవేశిస్తున్న పాదయాత్ర

నర్వ ఆగస్టు 13 : స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్‌ పాత్ర ఎంతో ఉందని మక్తల్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు వాకిటి శ్రీహరి, రాజుల ఆశిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు చేపడుతున్న ఆజాది గౌరవ్‌ పాదయాత్ర శనివారం మండలంలోని ఉందేకోడ్‌, పాతర్‌చేడ్‌, నర్వ వరకు 15 కిలో మీటర్ల పొడవునా కొనసాగింది. ఈ సందర్భంగా నర్వ మండల కేంద్రం భారీ ఊరేగింపు నిర్వహించి బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలోనే స్వాతంత్య్రం వచ్చిందని, ప్రస్తుతం మోదీ తన మెప్పు కోసం జాతీయ పతాకాన్ని ముందర వేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విడ్దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు చెన్నయ్య సాగర్‌, శ్రీనివాస్‌రెడ్డి, శరణప్ప, వెంకటేశ్వర్‌రెడ్డి, వివేక్‌రెడ్డి పాల్గొన్నారు.

నారాయణపేట రూరల్‌ : దేశ వనరులను విక్రయిస్తూ నిత్యవసర సరుకుల ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను అంతం చేద్దామని కాంగ్రెస్‌ యువజన నాయకుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అంత్వార్‌ నుంచి చిన్నజట్రం వరకు ఆజాదీ గౌరవ్‌ పాదయాత్ర చేపట్టారు.  కాంగ్రెస్‌ నాయకులు సదాశివారెడ్డి, ఎండీ గౌస్‌, కోట్ల రవీందర్‌రెడ్డి, బోయ శరణప్ప, శ్రీహరి, జలీల్‌, ఊశప్ప, శ్రీనివాస్‌, తిరుపతి పాల్గొన్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. అధికారం కాంగ్రెస్‌దే

 ఊట్కూర్‌ : ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీ అని మక్తల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు కే.ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పిలుపు మేరకు ఆజాదికి గౌరవ్‌ పాదయాత్ర శనివారం మండలంలోని అమీన్‌పూర్‌ గ్రామం నుంచి ఓబ్లపూర్‌, పగిడిమారి, వల్లంపల్లి గ్రామాల వరకు ఒక్క రోజు పాదయాత్రను నిర్వహించారు. అమీన్‌పూర్‌లో పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకరావడంలో కాంగ్రెస్‌ ప్రఽ దాన పాత్ర వహించిదన్నారు. ఈ రోజు భారతదేశం ప్రపంచ సరసన సమానంగా నిలబడిందంటే కాంగ్రెస్‌ కృషి మరవలేనిదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రైతు ఋణాలను మాఫీ చేస్తుందన్నారు. అనంతరం అమీన్‌పూర్‌, ఓబ్లాపూర్‌, పగిడిమారి గ్రామాల మీదుగా వల్లంపల్లి వరకు 20 కిలో మీటర్ల వరకు పాదయాత్ర కొనసాగింది. నాయకులు శంకర్‌, అశోక్‌, అజీం, బహ్మనందరెడ్డి, నర్సిములు, పొలప్ప, నరేష్‌, బాలరాజు, నర్సింహాగౌడ్‌, గజలప్ప, పురుషోత్తం జయప్ప, యూసూప్‌, రఫీక్‌, ఖాలీక్‌, హసన్‌, తాజోద్దీన్‌, విఠ ల్‌, నర్సింహా, రమేష్‌, రాజు, కేశవులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-14T05:15:04+05:30 IST