స్వాతంత్య్ర సంగ్రామంలో కాంగ్రెస్‌ పాత్ర ఎనలేనిది

ABN , First Publish Date - 2022-08-16T06:30:54+05:30 IST

స్వాతంత్య్ర సంగ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర ఎనలేనిదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

స్వాతంత్య్ర సంగ్రామంలో కాంగ్రెస్‌ పాత్ర ఎనలేనిది
పాదయాత్ర నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

 ఆజాదీకా గౌరవ్‌ యాత్ర ముగింపు సభలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

యాదాద్రి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి)/యాదగిరిగుట్ట రూరల్‌: స్వాతంత్య్ర సంగ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర ఎనలేనిదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆజాదీకా గౌరవ్‌ యాత్ర చివరి రోజు సోమవారం యాదగిరిగుట్ట నుంచి భువనగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ పార్టీ శ్రేణు లు అనిల్‌కుమార్‌రెడ్డిని గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. పట్టణ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. దేశ ప్రజలకు స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఎనలేని సేవ చేసిందని, దేశం కోసం ఎందరో మహనీయులు వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలలే బలమని, తాను చేపట్టిన పాదయాత్ర విజయవంతంలో వారి పట్టుదల ఎంతో ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో 200మంది కూడా లేర ని, కాంగ్రెస్‌ చేపట్టిన ఆజాదీకా గౌరవ్‌ యాత్రలో సుమారు ఆరువేల మంది వరకు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నానని, టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇనచార్జీ బీర్ల ఐలయ్య, సీనియర్‌ నా యకులు కల్లూరి రాంచంద్రారెడ్డి, మల్లే్‌షయాదవ్‌, రమే్‌షరాజు, మోహన, లక్ష్మారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కోట పెద్దస్వామి, టీపీసీసీ మా జీ కార్యదర్శి తంగేళ్లపల్లి రవికుమార్‌, మజహర్‌, నసీరుద్దీన, పవన, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక లక్ష్మీనరసింహస్వామి కొండకింద ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, నాయకులు, కల్లూరి రాంచంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షు డు కానుగు బాలరాజ్‌గౌడ్‌, నమిలె మహేందర్‌రెడ్డి, సుడు గు శ్రీనివా్‌సరెడ్డి, కలకుంట్ల బాలనర్సయ్యగౌడ్‌, గుడ్ల వరలక్ష్మీ, గుండు జ్యోతి, గుండ్లపల్లి భరత్‌గౌడ్‌, కౌన్సిలర్‌ అరుణారాజేష్‌, గుండు నర్సింహగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ వెంకట్‌రెడ్డి బలమైన నేత

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బలమైన నేత అని, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీలోని నేతల మధ్య వివాదం త్వరలోనే అధిష్ఠానం పరిష్కరిస్తుందని కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొనడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఉప ఎన్నిక అంశంపై డీసీసీ అధ్యక్షుడిగా తాను ఎంపీ ఇంటికి వెళ్లానని, ఫోన కూడా చేశానని, ఆయన స్పందించలేదని వెల్లడించారు.

ఎంపీ సోదరుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరుతుండటంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురైందన్నారు. వెంకట్‌రెడ్డిని ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కష్టపడి గెలిపించుకున్నామని, తాను కూడా ఎంతో కష్టపడ్డానని తెలిపారు. తన ఎన్నిక కంటే ఎక్కువగా కోమటిరెడ్డి కోసం పనిచేశానన్నారు. ఎంపీ భువనగిరి ఎప్పుడు వచ్చినా తామంతా అందుబాటులో ఉన్నామని, పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారమవుతాయన్నారు.


Updated Date - 2022-08-16T06:30:54+05:30 IST