రోడ్డు సేఫ్టీ బిల్లును వెంటనే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-05-20T06:39:24+05:30 IST

రోడ్‌ సేప్టీ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌ టీ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే. రాజన్న అన్నారు.

రోడ్డు సేఫ్టీ బిల్లును వెంటనే రద్దు చేయాలి
ధర్నా చేస్తున్న ఆటో యూనియన్‌ నాయకులు

నిర్మల్‌టౌన్‌, మే 19 : రోడ్‌ సేప్టీ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌ టీ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే. రాజన్న అన్నారు. గురువారం ఐఎఫ్‌టీ యూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ముందుధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే. రాజన్న మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సంవత్సరంలో మోటార్‌ వాహనాల చట్ట 2019ని సేఫ్టీ పేరుతో భారీగా చలాన్లు పెంచుతూ ఈ చట్టా న్ని తీసుకువచ్చారని, ఈ చట్టం ద్వారా మోటార్‌ వాహన యజమానులు, కార్మి కులు నడ్డి విరిచి వేలాది, లక్షలాది రూపాయల పెనాల్టీలు వేసి కార్మికుల బతుకుల పైన పెనుభారం మోపుతోందన్నారు. అదే విధంగా వాహన కొను గోలు దాని పైన తెలంగాణ ప్రభుత్వం పన్నుల భారం మెపిందని, వాహనాల జీవితాల పన్ను రెండు మూడు అంచెలుగా పెంచిందని అన్నారు.  ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు 9,000 చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇకనుంచి 12,000 జీవితకాల పన్ను చెల్లించాలి. అంటే అదనంగా మూడు వేల రూపాయలు పెరిగాయన్నారు. యూనియన్‌ నాయకులు ఎస్‌. నారాయణ, ఏ. కిషన్‌, కే. రాందాస్‌ పాల్గొన్నారు. 

ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా

పెంబి, మే 19 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫిట్‌నెస్‌ ఫైన్‌ రద్దు చేయాలని బుధవారం మండల కేంద్రంలో ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ నాయకు లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రోజువారీగా 50 రూపాయల పెనాల్టీ విధించడం కరెక్ట్‌ కాదన్నారు. ఇప్ప టికే పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ఇబ్బంది పడుతున్నామని అన్నారు. వాహనాలపై గ్రీన్‌టాక్స్‌, లైఫ్‌టాక్స్‌తో పాటు ఫిట్‌నెస్‌ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. వెంటనే ఫిట్‌నెస్‌ ఫైన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో మంచికంటి లక్ష్మణ్‌, సీపీఎం జిల్లా కమిటీ నాయకుడు శంభు, ఆటో యూనియన్‌ అధ్యక్షు డు రవి, ఉపాధ్యక్షులు ఆదిల్‌, పోశన్న, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:39:24+05:30 IST