వైసీపీ ప్రభుత్వంలో దళితుల హక్కులకు రక్షణ లేదు

ABN , First Publish Date - 2021-01-25T04:55:09+05:30 IST

వైసీపీ ప్రభు త్వంలో దళితుల హక్కులకు రక్షణ లేకుండా పో యిందని షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎర్రగుడి చంద్రబాబు విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వంలో   దళితుల హక్కులకు రక్షణ లేదు
సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

ఎస్సీ హక్కుల సంఘం నేత చంద్రబాబు

ప్రొద్దుటూరు అర్బన్‌, జనవరి 24 : వైసీపీ ప్రభు త్వంలో దళితుల హక్కులకు రక్షణ లేకుండా పో యిందని షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎర్రగుడి చంద్రబాబు విమర్శించారు. ఆదివారం పట్టణంలోని మైదుకూ రు రోడ్డులో గల షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిర క్షణ సంఘం కార్యాలయంలో జిల్లా డివిజన్‌ మండల కమిటీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు మండల స్థ్ధాయి నుంచి క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. కమిటీలు హక్కుల కోసం పోరాడాలని అప్పుడే జాతి చైతన్యం అవుతుందన్నారు. ఈ సందర్బంగా జిల్లా డివిజన్‌ మండల కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గోన సురేష్‌ బాబు, జమ్మలమడుగు డివిజన్‌ అధ్యక్షుడిగా పత్తూరు నాగన్న, ప్రధాన కార్యదర్శిగా కుండవరపు బాల య్య, కార్యదర్శిగా సత్యరాజు, సహాయ కార్యదర్శిగా గోన రమేష్‌ ఎన్నికయ్యారు. కొండాపురం మండల అధ్యక్షుడిగా పాలంకి బాబు, చాపాడు మండల అధ్యక్షుడిగా ఆమోసు ఎన్నికయ్యారు. కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరాజు జిల్లా అధ్యక్షుడు మేకల  శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T04:55:09+05:30 IST