ఓటుహక్కును వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-26T05:06:06+05:30 IST

ఓటుహక్కును వినియోగించుకోవాలి

ఓటుహక్కును వినియోగించుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్‌: ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

  • అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌


ఇబ్రహీంపట్నం రూరల్‌/యాచారం/ఆమనగల్లు/కడ్తాల/తలకొండపల్లి/ కందుకూరు/చేవెళ్ల/షాబాద్‌/కేశంపేట/ షాద్‌నగర్‌/కొత్తూర్‌/మొయినాబాద్‌ రూరల్‌, జనవరి 25: ప్రజాస్వామ్యంలో 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొన్నారు. మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధిహామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పని అడిగిన ప్రతి కూలీకి పనులు కల్పించాలని కోరారు. నర్సరీల్లో పనుల్లో వేగం పెంచాలన్నారు. ముఖ్యంగా కూలీలకు కూలి డబ్బులు పెండింగ్‌లో ఉంటే వెంటనే చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో పీడీ ప్రభాకర్‌, జిల్లాపరిషత్‌ సీఈవో దిలీ్‌పకుమార్‌, ఎంపీపీ కృపేష్‌, జడ్పీటీసీ మహిపాల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కప్పరి స్రవంతి, ఎంపీడీవో క్రాంతికుమార్‌ పాల్గొన్నారు. యాచారంలో మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీపీ కొప్పు సుకన్యబాషా జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రమాణం చేశారు. కె.శ్రీనివా్‌సరెడ్డి, రాజేందర్‌రెడ్డి, లక్ష్మీపతిగౌడ్‌, ఎండీ హబీబొద్దీన్‌ పాల్గొన్నారు. ఆమనగల్లు తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ పాండు నాయక్‌ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని అధికారులు, యువకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఎంపీడీవో వెంకట్రాములు, సీఐ జాల ఉపేందర్‌, ఎస్‌ఐలు ధర్మేశ్‌, వరప్రసాద్‌, నారాయణరెడ్డి, వస్పుల జంగయ్య, చంద్రశేఖర్‌, నటరాజ్‌ యాదయ్య, కె.మల్లయ్య పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల తహాసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి అధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో సర్పంచ్‌ స్వప్న భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్‌ చిత్రపటాన్ని విధిగా ఏర్పాటు చేసి గౌరవించాలని దళిత శక్తి ప్రోగ్రామ్‌ జిల్లా కార్యదర్శి వంకేశ్వరం రమేశ్‌, ఆమనగల్లు మండల అధ్యక్షుడు అశోక్‌, ఉపాధ్యక్షుడు వస్పుల బాల్‌రామ్‌లు ఒక ప్రకటనలో కోరారు. కందుకూరులో తహసీల్దార్‌ ఎస్‌.జ్యోతి, చేవెళ్లలో తహసీల్దార్‌ వినోద్‌కుమార్‌  తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట యువకులు, మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. రిపబ్లిక్‌ వేడుకల్లో అంబేద్కర్‌ ఫొటో పెట్టాలని ఆలిండియా అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజుఆలిండియా అంబేడ్కర్‌ యువజన సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో కోరారు. షాబాద్‌లో తహసీల్దార్‌ అమర్‌లింగంగౌడ్‌ ప్రతిజ్ఞ చేయించారు. కేశంపేటలో తహసీల్దార్‌ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఓటు ఆవశ్యకత వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి జాతీయ ఓటరు ప్రతిజ్ఞ చేశారు.  ఇన్‌చార్జి ఎంపీడీవో రవిచంద్రారెడ్డి, ఎస్సై కోన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఆర్డీవో రాజేశ్వరి ఓటు ప్రాధాన్యతను తెలుపుతూ ప్రతిజ్ఞ చేయించారు. కొత్తూర్‌ మున్సిపాలిటీ కార్యాలయం ముందు కమీషనర్‌ వీరేందర్‌ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మొయినాబాద్‌లో సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, బాకారం జాగీర్‌ గ్రామ సర్పంచ్‌ కొత్తపల్లి రాఘవరెడ్డి అంతర్జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని ఆయా పంచాయతీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటుహక్కుపై ప్రజలకు అవగహన కల్పించారు. 

Updated Date - 2022-01-26T05:06:06+05:30 IST