ఓటు హక్కు ఎంతో విలువైంది

ABN , First Publish Date - 2022-01-26T04:15:16+05:30 IST

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఓటు హక్కు ఎంతో విలువైంది
మంచిర్యాలలో ఓటరు ప్రతిజ్ఞ చేస్తున్న జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌

- జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌
- జిల్లావ్యాప్తంగా  ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. జాతీయ ఓటర్ల  దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో  జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అధికారులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 25న దేశంలో ఎన్నికల సంఘం ఏర్పాటైందని చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా, స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.  18 ఏళ్లు నిండిన వారందరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర అని తెలిపారు. అనంతరం వీడియో ద్వారా రాష్ట్ర గవర్నర్‌ సందేశాన్ని అధికారులతో కలిసి తిలకించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఏసీసీ: జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో కమిషనర్‌ బాలకృష్ణ మున్సిపల్‌ సిబ్బంది చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు.  జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞను ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T04:15:16+05:30 IST