Abn logo
Sep 17 2020 @ 00:27AM

ఆర్జీవీ బయోపిక్‌ మొదలైంది

‘‘తెలుగు, హిందీ చలన చిత్ర పరిశ్రమలో రామ్‌ గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) ప్రయాణం అద్భుతం. ఆయన బయోపిక్‌ తీసే అవకాశం నాకు కలగడం సంతోషంగా ఉంది. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో పార్ట్‌1 చిత్రీకరణ ఈ రోజు ప్రారంభించాం’’ అన్నారు నిర్మాత బొమ్మాకు మురళీ. దొరసాయి తేజ దర్శకత్వంలో ఆర్జీవీ బయోపిక్‌ నిర్మిస్తున్నారాయన. బుధవారం హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో పార్ట్‌1 మొదలైంది. టీనేజ్‌ ఆర్జీవీగా దర్శకుడు దొరసాయి తేజ నటిస్తున్నారు. ఆయనపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆర్జీవీ సోదరి విజయ క్లాప్‌ ఇవ్వగా, తల్లి సూర్యవతి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ‘‘వర్మ కాలేజీ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్‌ ఫైట్స్‌ మొదలుకుని ‘శివ’ సినిమా తీయడానికి ఏం చేశాడనేది పార్ట్‌ 1లో చూపిస్తాం. హైదరాబాద్‌లో 15 రోజులు తొలి షెడ్యూల్‌ చేస్తాం’’ అని దొరసాయి తేజ తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement