Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 20 Jan 2022 23:43:48 IST

రివర్స్‌ పీఆర్‌సీ రద్దు చేయాల్సిందే

twitter-iconwatsapp-iconfb-icon
రివర్స్‌ పీఆర్‌సీ రద్దు చేయాల్సిందేపీఆర్సీని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్‌ ముట్టడికి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు

భగ్గుమన్న గురువులు

ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

ఉద్రిక్తంగా మారిన కలెక్టరేట్‌ ప్రాంగణం 

భారీగా మోహరించిన పోలీసులు 

ఎమ్మెల్సీ, ఫ్యాప్టో నేతల అరెస్టు

రివర్స్‌ పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ లోకం భగ్గుమంది. ఐఆర్‌ కంటే తక్కువ పీఆర్సీ ప్రకటించడంతో గురువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఫ్యాప్టో ఆధ్వర్యంలో గురువారం కడప కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. దీనిని నిర్వీర్యం చేయాలనే పోలీసుల ఎత్తులు ఫలించ లేదు. ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్భంధాలు చేసినా.. పోలీసులను ఎదురొడ్డి ఉపాధ్యాయులు భారీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, ఇనుప ముళ్లకంచెలను దాటుకుని ఉపాధ్యాయులు ముందుకు దూసు కెళ్లారు. మూతవేసిన కలెక్టరేట్‌ గేటు ఎక్కి లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గురువు లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి స్పృహతప్పి పడి పోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చీకటి జీవోలను వెనక్కి తీసుకుని.. న్యాయమైన పీఆర్సీ ఇచ్చేదాకా ఉద్యమాలు ఆపమంటూ నేతలు నినదించారు.


కడప(ఎడ్యుకేషన)/ కడప, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రివర్స్‌ పీఆర్సీని రద్దు చేయాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఆమోద యోగ్యమైన పీఆర్సీ ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిం చారు. ఫ్యాప్టో రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టారు. ప్రభుత్వం పోలీసుల ద్వారా ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉపాధ్యాయ సంఘాలు వాటిని లెక్క చేయకుండా భారీగా కలెక్టరేట్‌ వద్దకు చేరు కున్నారు. ఉపాధ్యాయుల నినాదాలతో కలెక్టరేట్‌ ప్రాంగణం దద్దరిల్లింది. పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్లకంచెలను సైతం ఉపాధ్యాయులు తొలగించి ముందుకు దూసుకెళ్లారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లా డుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్యోగ ఉపాధ్యా యులకు జీతాలు పెరుగుతాయని అయితే ఈ పీఆర్సీ ద్వారా జీతాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశుతోష్‌మిశ్రా ఇచ్చిన నివేదికను బయట పెట్టకుండా కేవలం కార్యదర్శుల కమిటీ నివేదికను పీఆర్సీ అని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు అని చెప్పి మూడేళ్ల యినా అతీగతి లేదన్నారు. కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ వారికి కూడా  ఉద్యోగ భద్రత కల్పించలేదని తెలిపారు. ఉపాఽ ధ్యాయులపై రాష్ట్ర వ్యాప్తంగా కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్‌ పీఆర్సీ ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని జేఏసీ ఉద్యోగ సంఘం నాయకులను మళ్లీ చర్చకు పిలిచి అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీ ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగదని అన్నారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన జి.వెంకట సుబ్బారెడ్డి, మాజీ రాష్ట్ర చైర్మన జీవీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఐఆర్‌ కన్నా ఎక్కువ శాతం ఫిట్మెంట్‌తో పీఆర్సీ ఇవ్వాలన్నారు. హెచ ఆర్‌ఏ స్లాబ్‌ను పాత విధానంలో భాగంగా కొనసాగించాలని చెప్పారు. క్వాంటమ్‌ పెన్షన విధానాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని తెలిపారు. కేంద్ర పీఆర్సీతో సంబంధం లేకుండా రాష్ట్ర పీఆర్సీ ఐదు సంవత్సరాలకే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సచివాలయ ఉద్యోగులను గత అక్టోబర్‌ 2 నాటికి రెగ్యులర్‌ చేయాలని కోరారు.


ఎమ్మెల్సీ, ఫ్యాప్టో నేతల అరెస్టు

కలెక్టరేట్‌ ముట్టడిలో భాగంగా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వ ర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. ఇనుప ముళ్ల కంచె.. బ్యారికేడ్లు అడ్డంగా పెట్టినా గురువులు వాటిని లెక్క చేయకుండా కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు వెళ్తుండగా అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత.. తోపులాట జరిగాయి. ఈ సందర్భంగా ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. ఆయనకు ఉపాధ్యాయులు నీళ్లు తాపి లేపి కూర్చో బెట్టారు. తోపులాటతో ఆయన చొక్కా సైతం చిరిగి పోయింది. ఉపాధ్యాయులు బ్యారికేడ్లను, ఇనుప ముళ్లకంచెలను దాటుకుని ముందుకెళ్లారు. కలెక్టరేట్‌ గేటు ఎక్కి లోనికి పోయే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వీరిని అదే స్థాయిలో అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డితో పాటు పలువురు ఫ్యాప్టో నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషనకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.


భారీ బందోబస్తు

ఫ్యాప్టో ముట్టడిని భగ్నం చేయాలని పోలీసులు కలెక్టరేట్‌ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు నలువైపులా ఉన్న మార్గాలు మూసి వేశారు. బ్యారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు.


పలు సంఘాల మద్దతు

కలెక్టరేట్‌ ముట్టడికి ఆర్‌యూపీపీ, ఏపీ సీపీఎస్‌ సీఏ, ఆర్‌జేయూపీ, ఆపస్‌, పీఆర్‌టీయూ, ఏపీపీఈటీ, ఎస్‌ఏపీఈ, ఐటా, రూటా, ఏపీ సీపీఎస్‌యూఏ సంఘాలు, తమ సంపూర్ణ మద్దతును ప్రకటిం చాయి. అలాగే ఆయా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


కరోనా భయాన్ని లెక్క చేయకుండా..: 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. అత్యధిక శాతంలో కేసులు నమోదవుతున్నాయి. అయినా సరే ఉపాధ్యా యులు కరోనాను సైతం లెక్క చేయకుండా హాజరు కావడం చూస్తుంటే వారు ఎంత అన్యాయానికి గురయ్యారు ఇట్టే అర్థమవుతుంది. ఫ్యాప్టో జిల్లా కన్వీనర్‌ జి.వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర మాజీ కన్వీనర్‌ జీవీ నారాయణరెడ్డి నాయకత్వంలో రివర్స్‌ పీఆర్సీ జీవోలను నిరసిస్తూ చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడికి గురువులు వెల్లువలా తరలివచ్చి దిగ్విజయం చేశారు.


ఎక్కడికక్కడే అరెస్టులు

కలెక్టరేట్‌ ముట్టడితో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఫ్యాప్టో నాయకులకు నోటీసులు ఇచ్చి ముందస్తు అరెస్టు చేశారు. జిల్లా ఫ్యాప్టో నాయకులు బి.లక్ష్మిరాజా, కె.సురేష్‌బాబు, కె.బాలగంగి రెడ్డిలను అరెస్టు చేశారు. అలాగే జిల్లా నలుమూలల నుంచి గురువారం బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. సీఎం జగన సొంత నియోజకవర్గం పులివెందుల, వేంపల్లి నుంచి ఎస్టీయూ రాష్ట్ర అసోషియేట్‌ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యా యులు కలెక్టరేట్‌ ముట్టడికి కడపకు బయలు దేరగా పెండ్లిమర్రి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆరెస్టును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. వైఎస్‌ఆర్‌ టీఎఫ్‌ జిల్లా జిల్లా ఉపాఽధ్యక్షుడు శివ శంకర్‌రెడ్డి, యూటీఎఫ్‌ నాయకులు సుబ్బరాజు తదితరులను పోలీసులు ఆరెస్టు చేసి స్టేషనలో నిర్బంధించారు. మధ్యాహ్నం 2.30 గంటల తరువాత వదిలిపెట్టారు. సుండుపల్లి మండలా నికి చెందిన ఉపాధ్యా యులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషనకు తరలిస్తే.. వారు అక్కడే ఆందోళనకు దిగారు. పోరుమామిళ్ల మండలం ఫ్యాప్టో నాయకులు కడపకు వెళ్లకుండా పోలీసులు అడ్డు కున్నారు. ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా మీడియా ఇనచార్జి పగడాల బాలకృష్ణుడిని సీకేదిన్నె పోలీసులు అరెస్టు చేసి స్టేషనలో నిర్బంధించారు. ఆందోళన అనంతరం వదిలేశారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి వస్తున్న ఉపాధ్యాయులను ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు, చాపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజంపేటలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకొని స్టేషనలో ఉంచారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా పోలీసుల కళ్లుగప్పి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆందోళనలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

రివర్స్‌ పీఆర్‌సీ రద్దు చేయాల్సిందేకలెక్టరేట్‌ గేటు ఎక్కి లోనికి పోయే ప్రయత్నం చేస్తున్న వారిని వెనక్కు లాగుతున్న పోలీసులు


రివర్స్‌ పీఆర్‌సీ రద్దు చేయాల్సిందేకలెక్టరేట్‌ ఎదుట భారీగా మోహరించిన పోలీసులు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.