మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కష్టమే!

ABN , First Publish Date - 2021-05-12T10:49:30+05:30 IST

ఐపీఎల్‌ మిగతా సీజన్‌లో తమ ఆటగాళ్లు ఆడకపోవచ్చని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌ తెలిపాడు. కరోనాతో వాయిదా పడిన

మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కష్టమే!

లండన్‌: ఐపీఎల్‌ మిగతా సీజన్‌లో తమ ఆటగాళ్లు ఆడకపోవచ్చని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌ తెలిపాడు. కరోనాతో వాయిదా పడిన ఈ లీగ్‌లో మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ జూన్‌ నుంచి ఇంగ్లండ్‌ షెడ్యూల్‌ బిజీగా ఉంటుందని గుర్తుచేశాడు. సెప్టెంబరు, అక్టోబరులో జట్టు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ టూర్‌కు వెళుతుందని, అందుకే ఐపీఎల్‌ను రీషెడ్యూల్‌ చేసినా వారు ఆడలేరని అన్నాడు. ఈ పర్యటనల్లో పూర్తి స్థాయి ఆటగాళ్లతోనే ఇంగ్లండ్‌ బరిలోకి దిగాలనుకుంటోందని స్పష్టం చేశాడు. బెన్‌ స్టోక్స్‌, ఆర్చర్‌, బట్లర్‌, మోర్గాన్‌, కర్రాన్‌ సోదరులు, బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌, జోర్డాన్‌, డేవిడ్‌ మలాన్‌, రాయ్‌, బిల్లింగ్స్‌ ఐపీఎల్‌లో ఆడుతున్నారు.

Updated Date - 2021-05-12T10:49:30+05:30 IST