పెళ్లయిన కొద్ది గంటలకే షాకింగ్ సీన్.. పోలీస్ స్టేసన్‌కు చేరిన కథ... వధూవరులను చితకబాదిన బంధువు!

ABN , First Publish Date - 2021-07-20T16:14:07+05:30 IST

వారిద్దరూ ప్రేమికులు.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు..

పెళ్లయిన కొద్ది గంటలకే షాకింగ్ సీన్.. పోలీస్ స్టేసన్‌కు చేరిన కథ... వధూవరులను చితకబాదిన బంధువు!

వారిద్దరూ ప్రేమికులు.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు.. విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు బంధువులు దాడికి ప్రయత్నించారు.. దీంతో ప్రేమికులిద్దరూ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.. అక్కడకు కూడా వచ్చిన బంధువులు పోలీసుల ఎదుటే ప్రేమికులిద్దరినీ చితకబాదారు.. మొదట షాకైన పోలీసులు తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.. ఝార్ఖండ్‌లోని సింధ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన సోమవారం జరిగింది. 


సింధ్రీ ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రేమికులు సోమవారం పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అమ్మాయి తరఫు వారికి ఆగ్రహం తెప్పించింది. వారిద్దరినీ చంపెయ్యాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రేమికులు ముందు జాగ్రత్తగా సింధ్రీలోని మహిళా పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నారు. అక్కడకు వచ్చిన బంధువులు పోలీసుల ఎదుటే ప్రేమికులను చితకబాదారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని పోలీసులు కాసేపటికి తేరుకుని వారిని అడ్డుకున్నారు. దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రేమికులిద్దరికీ భద్రత ఏర్పాటు చేశారు. 


Updated Date - 2021-07-20T16:14:07+05:30 IST