నిబంధనలు పక్కాగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-05-24T05:20:48+05:30 IST

పది పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు పక్కాగా అమ లు చేయాలని కలెక్టర్‌ హరిచందన ఆదేశించారు.

నిబంధనలు పక్కాగా అమలు చేయాలి
పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

- కలెక్టర్‌ హరిచందన

- ఎస్పీతో కలిసి పదవ తరగతి

  పరీక్షా కేంద్రాల పరిశీలన

నారాయణపేట/ నారాయణపేటటౌన్‌, మే 23:  పది పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు పక్కాగా అమ లు చేయాలని కలెక్టర్‌ హరిచందన ఆదేశించారు. సోమవారం ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్‌ జి ల్లా కేంద్రంలోని లిటిల్‌ స్టార్‌, బ్రిలియంట్‌ టాలెం ట్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ప రీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకు న్నారా.. లేదా.. రవాణాలో ఏమైనా ఇబ్బందులు వ చ్చాయా.. అని ఆరా తీశారు. హాల్‌ టికెట్లు పరిశీలి స్తున్నారా.. లేదా అని నిర్వాహకులను అడిగి తె లుసుకున్నారు. విద్యార్థు లు, ఇన్విజిలేటర్లు ఎవరూ పరీక్షా కేంద్రాలకు సెల్‌ ఫోన్లతో రావడానికి అ నుమతి లేదని కలెక్టర్‌ ఆదే శించారు. కేంద్రాల స మీపంలో 144 సెక్షన్‌ అమలు తో పాటు పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామని, జిరాక్స్‌ సెంటర్ల మూసివేశామని ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కేం ద్రాల్లో నీటి వసతి, విద్యుత్‌, ప్యాన్లు, ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేశామని డీఈవో లి యాఖత్‌ అలీ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ వెంట డీఈ వో లియాఖత్‌ అలీ, సిబ్బంది తదితరులున్నారు.

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 

జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగగా 8067 మంది రెగ్యూలర్‌ విద్యార్థులకు గాను 7951 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 116 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్‌  విద్యార్థులు ముగ్గురికి ఇద్దరు పరీక్షలు రాయగా ఒకరు గైర్హాజరయ్యారు.    గంట ముందే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులను అనుమతించారు. డీఈఓ లియాఖత్‌ అలీ, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి రెండు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈఓ పట్టణంలోని ఆరు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. 

Updated Date - 2022-05-24T05:20:48+05:30 IST