కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనలు కఠినతరం

ABN , First Publish Date - 2020-07-14T11:43:36+05:30 IST

కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనలు మరింత కఠిన తరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను

కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనలు కఠినతరం

సీఎస్‌ నీలం సాహ్ని


కడప(కలెక్టరేట్‌),జూలై 13: కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనలు మరింత కఠిన తరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం విజయవాడ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో, సంబంధిత అధికారులతో కోవిడ్‌ అంశంపై ఆమె జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడుతూ కోవిడ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, అదే విధంగా జిల్లాల్లో అక్కడక్కడా కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నాయని తెలిపారు.


కోవిడ్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన అన్ని అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలు అనుసరించేలా చర్యలు చేపట్టాలన్నారు. బయటకు వచ్చే ప్రతి వ్యక్తి మాస్క్‌ విధిగా ధరించాలని, అలాగే భౌతిక దూరం పాటించేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కడప కలెక్టర్‌ చాంబరు నుంచి కల్టెర్‌ సి.హరికిరణ్‌తో పాటు జాయింట్‌ కలెకర్‌ (అభివృద్ధి) సాయికాంత్‌ వర్మ, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఉమాసుందరి, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వరప్రసాదరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T11:43:36+05:30 IST