చమురు ధరల తగ్గింపు అభినందనీయం

ABN , First Publish Date - 2022-05-23T05:18:02+05:30 IST

దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌పై భారీ ఎత్తున ధరలు తగ్గించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి పేర్కొన్నా రు.

చమురు ధరల తగ్గింపు అభినందనీయం
మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి

- ప్రధాన మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), మే 22 : దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌పై భారీ ఎత్తున ధరలు తగ్గించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి పేర్కొన్నా రు. ఈ సందర్భంగా ఆదివారం తెలంగాణ చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి ఆయనతో పాటు కమిటీ సభ్యులు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తారని, నిత్యావసర సరుకులు, ముడిసరుకులు ధరలు తగ్గిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా పెట్రోల్‌పై 8, డీజిల్‌పై 6 రూపాయలు భారీగా తగ్గించారని తెలిపారు. అన్నిరాష్ట్రాలు తమ వ్యాట్‌ను తగ్గించుకోవాలని ప్రధాని పిలుపు మేరకు కేరళ, రాజస్థాన్‌, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యాట్‌ను తగ్గించాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పెట్రోల్‌, డీజిల్‌పై వెంటనే వ్యాట్‌ను తగ్గించి రాష్ట్ర ప్రజలకు మేలుచేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, కృష్ణవర్ధన్‌ రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం 

బాదేపల్లి : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నాయకులు ఆదివారం పట్టణంలోని సిగ్నల్‌ గడ్డలోని పూలే విగ్రహం వద్ద ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి క్షీరా భిషేకం చేశారు. పట్టణ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ పేద ప్రజలకు భారం పడకుండా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధర తగ్గించినట్లు తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత తగ్గించి, ప్రజలపై భారం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ కుమ్మరి రాజు, ఓబీసీ జిల్లా అధికార ప్రతినిధి మధు, నాయకులు అనంతకిషన్‌, నాగరాజు, మహేష్‌, మల్లేష్‌, శ్రీనివాస్‌, మురళి, సురేందర్‌, వినయ్‌, శ్రీరామ్‌, నాగరాజు, రమేష్‌, బాలు, విక్రమ్‌, విశ్వనాథ్‌ పాల్గొన్నారు. 

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

హన్వాడ : సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్ర భుత్వం గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించినందుకు హన్వాడ మండల బీజేపీ అధ్యక్షుడు  వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా బుచ్చి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్‌రెడ్డి, శివ లింగం, కావలి శ్రీను, సుదర్శన్‌రెడ్డి, చెన్నప్ప, కేశవులు, అంజిల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:18:02+05:30 IST