నా రాజీనామాకు కారణం ఎమ్మెల్యేనే: గ్రామ సర్పంచ్

ABN , First Publish Date - 2021-10-11T22:27:31+05:30 IST

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ గాదె సంధ్య రాజీనామా...

నా రాజీనామాకు కారణం ఎమ్మెల్యేనే: గ్రామ సర్పంచ్

 నల్గొండ: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ గాదె సంధ్య రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వేధింపులు భరించలేక సర్పంచ్ రాజీనామా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామ అభవృద్ది జరగకుండా ప్రతి విషయంలో అడ్డుకుంటున్నారని పై స్థాయి అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాక తమ పార్టీలోకి రావాలని ఒత్తిడితో పలుమార్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓ మోతీలాల్‌కి గ్రామ సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

Updated Date - 2021-10-11T22:27:31+05:30 IST