పన్ను పోటే అసలు సమస్య

ABN , First Publish Date - 2020-09-16T06:21:53+05:30 IST

మోటారు వాహనాలపై విదిస్తున్న భారీ పన్ను ల భారంపై టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ (టీకేఎం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

పన్ను పోటే అసలు సమస్య

 విస్తరణ సమస్యే లేదు :  టయోటా కిర్లోస్కర్‌


న్యూఢిల్లీ: మోటారు వాహనాలపై విదిస్తున్న భారీ పన్ను ల భారంపై టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ (టీకేఎం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో కార్ల అమ్మకాలు అంతం త మాత్రంగానే ఉండడానికి అధిక పన్ను పోటే కారణమని కంపెనీ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ విశ్వనాధన్‌ చెప్పారు. మార్కెట్‌ ఏ మాత్రం పుంజుకున్నట్టు కనిపించినా ప్రభుత్వం పన్నుల భారం పెంచేస్తోందన్నారు.

‘భారీ పెట్టుబడులతో ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేశాక, మీరు మాకొద్దు అన్నట్టు ప్రభు త్వ వైఖరి కనిపిస్తోంది’ అన్నారు. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింత విస్తరించే యోచనే లేదన్నారు. 


మరీ ఇంత భారమా?:

కార్లు, బైక్స్‌, ఎస్‌యూవీలపై 28 శాతం జీఎ్‌సటీతో పాటు వాహనాలను బట్టి 1 నుంచి 22 శాతం లెవీ విధించడాన్ని విశ్వనాధన్‌ తప్పుబట్టారు. అధిక పన్ను పోటుతో ధరలు పెరి గి కొనుగోలుదారులు ముందుకు రావడం లేదన్నారు. కాగా టీకేఎం మరో వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ మాత్రం విద్యుత్‌ వాహనాల కోసం వచ్చే 12 నెల ల్లో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు చెప్పారు. 

Updated Date - 2020-09-16T06:21:53+05:30 IST