ప్రశ్నించే గొంతు నొక్కడమే

ABN , First Publish Date - 2022-01-19T05:39:50+05:30 IST

ముందస్తు అరెస్టు చేయ డం అంటే ప్రశ్నించే గొంతును నొక్కడమేనని బీజేపీ, యువమోర్చా జిల్లా నాయకులు విమర్శించారు.

ప్రశ్నించే గొంతు నొక్కడమే
బీజేపీ నాయకులను అరెస్టు చేసి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన పోలీసులు

-   ముందస్తు అరెస్టులపై బీజేపీ నాయకుల మండిపాటు


మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌), జనవరి 18 : ముందస్తు అరెస్టు చేయ డం అంటే ప్రశ్నించే గొంతును నొక్కడమేనని బీజేపీ, యువమోర్చా జిల్లా నాయకులు విమర్శించారు. మంగళవారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌ రావు, మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి జిల్లా పర్య టన చేశారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో మహబూబ్‌నగర్‌, జడ్చర్ల ని యోజకవర్గాల్లో బీజేపీ, బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ అ క్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ, బీజేవైఎం ఎ క్కడుంది అన్న టీఆర్‌ఎస్‌ మంత్రులు ఇల్లిల్లు తిరిగి తెల్లవారు జామున 3, 4 గంటల సమయంలో మమ్ములను అక్రమంగా పోలీసులు ఎందుకు అరెస్టు చేసి స్టేషన్లలో పెట్టారో వారే సమాధానం చెప్పాలని కోరారు. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం నిర్వహిస్తామని స్ప ష్టం చేశారు. అరెస్టు అయినవారిలో బీజేపీ జి ల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్తకోట కిరణ్‌రెడ్డి, పట్ణణ అ ధ్యక్షుడు పోతురాజేందర్‌రెడ్డి, నాయకులు రాజు గౌడ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, బొంగు గంగన్న, తిరుప తిరెడ్డి, విజయ్‌, ప్రవీణ్‌, నాగరాజ్‌ గౌడ్‌, రాఘ వేందర్‌, బీజేవైఎం గడ్డం నాగరాజు, శ్రీనాథ్‌, శ్రీధర్‌, శివారెడ్డి, శ్రీకాంత్‌, గోవింద్‌ నాయక్‌, మంహేందర్‌, ప్రవీణ్‌, ఉదయ్‌, చెన్నయ్య పాల్గొన్నారు. 


జడ్చర్లలో ముందస్తు అరెస్ట్‌ 


జడ్చర్ల : రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో జడ్చర్లలో బీజేపీ నాయ కులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. తెల్లవారుజాము నుంచే బీజేపీ నాయకుల ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసు కుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయి న వారిలో కౌన్సిలర్‌ కుమ్మరి రాజు, నా యకు లు వెంకట్‌రాంరెడ్డి, మధు, అనంతకిషన్‌, వెంక ట్‌, జగదీష్‌ ఉన్నారు. 


రాజాపూర్‌లో...


రాజాపూర్‌ : రాజాపూర్‌లోనూ బీజేపీ మండల అధ్యక్షుడు కావలి రామకృష్ణతోపాటు మండల నాయకులను పోలీసులు ఉదయమే అరెస్టు చేశారు.  స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామకృష్ణ, శేఖర్‌, రాజు, ఆదిత్య, గంగాధర్‌ గౌడ్‌ ఉన్నారు.


బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకుల అరెస్ట్‌


బాలానగర్‌ : మంగళవారం తెల్లవారుజామున ఐదుగంటలకే మండలంలోని వివిధ గ్రామాల్లో బీజేపీ నాయకులను పోలీసులు అదు పులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వదిలిపెట్టారు. పోలీ సుల అదుపులో బీజేపీ నాయకులు నర్సింహులు, ప్రతాప్‌రెడ్డి, అవినాష్‌, రాజు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దత్తాత్రేయ, ప్రవీణ్‌, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 


బీజేపీ నాయకుల ఆరెస్టు


మిడ్జిల్‌ : మిడ్జిల్‌ల్‌లోనూ బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి, నాయకులు కుమార్‌గౌడ్‌, లాలు, విష్ణుభాయ్‌, శ్రీశైలం, భాస్కర్‌, యాదయ్య, రవీందర్‌, జ్ఞానేశ్వర్‌, శేఖర్‌ ఉన్నారు.



Updated Date - 2022-01-19T05:39:50+05:30 IST