ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ABN , First Publish Date - 2022-06-29T07:04:58+05:30 IST

ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్‌ పట్టణం లో మంగళవారం ప్రభుత్వాసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

 ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రాయికల్‌, జూన్‌ 28: ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్‌ పట్టణం లో మంగళవారం ప్రభుత్వాసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయికల్‌ నడి బొడ్డున కోట్ల విలువ చేసే ప్రభుత్వాసుపత్రి స్థలాన్ని అక్రమణదారులు కబ్జా చేయాలని చూస్తున్నారని వారికి అధికారులు వత్తాసు పలుకుతు న్నారని ఆరోపించారు. ఈవిషయమై కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో అ నుమతులు రద్దు చేయడంతో పాటు మున్సిపల్‌ కమీషనర్‌, టీపీవోలపై వేటు వేశారని అన్నారు. భూమిని రక్షించాలని తాను సీఎంకుఫిర్యాదు చే యడంతో ఛీఫ్‌ సెకరెట్రీ విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. భూమిపై సమగ్ర విచారణ జరపాలని లేని యెడల అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యా చరణ రూపొందించి ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు బొడ్గం జలపతిరెడ్డి, లింగరెడ్డి,, నర్సయ్య, గంగరెడ్డి, నాయకులు రవీంధర్‌రావు, మహేంధర్‌గౌడ్‌, రమేష్‌, మహిపాల్‌, దివాకర్‌, మున్ను, శాఖీర్‌, నర్శింహరెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T07:04:58+05:30 IST