Abn logo
Sep 20 2021 @ 23:19PM

సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

జమ్మలమడుగు చేరిన సైకిల్‌ యాత్ర

జమ్మలమడుగు రూర ల్‌, సెప్టెంబరు 20: బుడగ జంగం వారికి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బుడగ జంగాల హ క్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మధు, జమ్మలమడుగు నాయకుడు నల్లప్ప డిమాండ్‌ చేశారు. సైకిల్‌ యాత్ర సోమవారం జమ్మలమడుగుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడగ జంగాల వారికి హక్కులకోసం పోరాటం చేయాలని  పిలుపునిచ్చారు. బుడగ జంగాల వారిని ఎస్సీలుగా గుర్తించి  ప్రతి కుటుంబానికి 4 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు.  బుడగ జంగాల హక్కుల నేతలు పాల్గొన్నారు.