ట్రిపుల్‌ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలి: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2020-09-18T17:54:29+05:30 IST

రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో..

ట్రిపుల్‌ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలి: తులసిరెడ్డి

వేంపల్లె(కడప): రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో అడ్మిషన్ల ప్రక్రి య ప్రారంభించాలని ఆర్జీయూకేటీ చాన్సలర్‌ కేసీ రెడ్డిని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి కోరారు. అడ్మిషన్ల ప్ర క్రియపై గురువారం ఇడుపులపాయలో చాన్సిలర్‌ను కలిసి ఆయన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది జూన్‌ మాసంలో మొదటి ఏడాది కోర్సుకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా ఈ ఏడాది సెప్టెంబరు వచ్చినప్పటికీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు.


మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్‌ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. దీంతో బాసర ట్రిపుల్‌ఐటీలో నాన్‌-లోకల్‌ కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్‌ వాటాగా 150 సీట్లు ఉంటాయని, ఏపీలో విద్యార్థులకు గ్రేడ్‌పాయింట్లు ఇవ్వని కారణంగా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో విద్యార్థులకు అర్థం కావడం లేదన్నారు. ఏపీ విద్యార్థులు నష్టపోకుండా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.


అదేవిధంగా ఇంటర్‌ రెండో సంవత్సర బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా ప్రతిష్టాత్మకమైన ఉన్నత చదువులకు పోలేకపోతున్నారన్నారు. ఈ సమస్యలపై వెంటనే దృష్టి సారించి ప్రతిభావంతులైన విద్యార్థుల బంగారు భవిష్యత్‌ నాశనం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2020-09-18T17:54:29+05:30 IST