సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-01-25T06:10:11+05:30 IST

గ్రామపంచాయతీ సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల సంఘం అధ్యక్షుడు బోయిని కొమురయ్య, గౌరవ అధ్య క్షుడు ఉప్పుల అంజనీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి
సమావేశానికి హాజరైన సర్పంచులు

సర్పంచుల సంఘం అధ్యక్షుడు బోయిని కొమురయ్య, గౌరవ అధ్య క్షుడు ఉప్పుల అంజనీప్రసాద్‌ డిమాండ్‌

కరీంనగర్‌ రూరల్‌, జనవరి 24: గ్రామపంచాయతీ సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల సంఘం అధ్యక్షుడు బోయిని కొమురయ్య, గౌరవ అధ్య క్షుడు ఉప్పుల అంజనీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా సర్పంచుల సంఘం సమా వేశం  కాసిపేట సర్పంచు గంప మల్లీశ్వరి అధ్యక్షతన కల్యాణ మండపంలో జరిగింది. 

ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులు ఉత్సవ విగ్రహా లుగా మాత్రమే మిగిలిపోతున్నారన్నారు. సర్పంచులు అప్పులుచేసి అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు.  సర్పంచుల సమస్యలు పరి ష్కరించని పక్షంలో జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు. తీగల మోహన్‌రెడ్డి, లింగాలరజిత, మహేందర్‌రెడ్డి, ఉప్పు లేటి ఉమారాణి, మేడి అంజయ్య, ఎస్సీ, ఎస్టీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు అజయ్‌రెడ్డి, మేఘరాజు పుల్లెల లక్ష్మీ, కర్ర ప్రసన్న వేణుగోపాల్‌, మురళి, అభిషేక్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T06:10:11+05:30 IST