Abn logo
Sep 24 2021 @ 23:50PM

స్కీమ్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

నంద్యాలలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

  1. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తోట మద్దులు


నంద్యాల టౌన్‌, సెప్టెంబరు 24: స్కీమ్‌ వర్కర్ల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తోట మద్దులు, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కార్యదర్శి గౌస్‌ అన్నారు. శుక్రవారం స్కీమ్‌ వర్కర్ల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు నంద్యాల పట్టణంలో సీఐటీయూ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ అర్బన్‌ కార్యదర్శి హన్నమ్మ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ స్కీమ్‌లన్నింటినీ సంస్థాగతం చేసి స్కీమ్‌ వర్కర్లను క్రమబద్ధీకరించాలని, నెలకు రూ.21వేలు కనీస వేతనం, పీఎఫ్‌, ఈఎ్‌సఐ, గ్రాట్యుటీ కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, రూ.50లక్షల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ, డీవైఎ్‌ఫఐ, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.


పాణ్యం: ప్రభుత్వ పథకాలలో పనిచేసే వారందరినీ స్కీమ్‌ వర్కర్లుగా ప్రభు త్వం గుర్తించాలని సీఐటీయూ కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం తహసీల్దారు కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. నాయకులు వెంకటమ్మ, అనసూయ, శ్యామల, స్వరూప, పుల్లమ్మ, సుశీల పాల్గొన్నారు. 


శిరివెళ్ల: స్కీమ్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం అంగన్‌వాడీలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సీనియర్‌ అసిస్టెంట్‌ తులసీబాయికి వినతిపత్రం అందజేశారు. ఈసం దర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్‌ వర్కర్లకు రూ.21 వేలు కనీస వేతనం, పీఎఫ్‌, ఈఎ్‌సఐ సదుపాయాలు కల్పించాలని, కరోనాతో మృతి చెందిన స్కీమ్‌ వర్కర్లకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  


ఆళ్లగడ్డ: ప్రభుత్వ పథకాలలో పని చేసే స్కీమ్‌ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు నాగరాజు, వెంకట్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో ధర్నా చేశారు. స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎ్‌సఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. 


ఓర్వకల్లు: స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్‌, ఎస్‌.షాజహాన్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో స్కీమ్‌ వర్కర్లు ప్రజలకు తమ సేవలు అందించారన్నారు. అంగన్‌వాడీలను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తించలేదన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.