జూట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-20T06:34:54+05:30 IST

చిట్టివలస జూట్‌ మిల్లు యాజమాన్యంతో చేసిన ఒప్పందంలో భాగంగా అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును కార్మిక సంఘాల నాయకులు కోరారు.

జూట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జూట్‌ మిల్లు నాయకులతో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి

భీమునిపట్నం, అక్టోబరు 19: చిట్టివలస జూట్‌ మిల్లు యాజమాన్యంతో చేసిన ఒప్పందంలో భాగంగా అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును కార్మిక సంఘాల నాయకులు కోరారు. మంగళవారం రాత్రి క్యాంప్‌ కార్యాలయంలో జూట్‌ యూనియన్‌ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, మారుపేరుతో జూట్‌ మిల్లులో పనిచేసిన కార్మికులకు మిల్లు యాజమాన్యం గ్రామంలో వుండే అసలు పేరుతోనే  గ్రాట్యుటీ, నష్టపరిహారం చెల్లించిందని, పి.ఎఫ్‌., పెన్షన్‌ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మిల్లు కో ఆపరేటివ్‌ స్టోర్స్‌ కు బకాయిపడిన రూ.26.5లక్షలు వెంటనే చెల్లించాలని కోరారు.  మరో 11 సమస్యలపై మంత్రితో చర్చించారు. ఈ సమావేశంలో నాయకులు కాకర్లపూడి వెంకట వరహాలరాజు, జీరు వెంకటరెడ్డి, చిల్ల వెంకటరమణ, దల్లి అప్పలరెడ్డి, మద్దిల వెంకట గురుమూర్తి, పడాల రమణ, కొండపు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T06:34:54+05:30 IST