హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-02-26T04:02:25+05:30 IST

సివిల్‌ సప్లయీస్‌లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి 14 నెలల వేతనాలను చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు డిమాండ్‌ చేశారు. గురువారం ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ, అర్థనగ్న ప్రదర్శన, రాస్తారోకోలు నిర్వహించారు.

హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
బెల్లంపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, పిబ్రవరి 25: సివిల్‌ సప్లయీస్‌లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి 14 నెలల వేతనాలను చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు డిమాండ్‌ చేశారు. గురువారం ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ, అర్థనగ్న ప్రదర్శన, రాస్తారోకోలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హమాలీలతో పనులు చేయించుకొని వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేస్తోం దని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల గారడీ తప్ప కార్మికుల కు చేసిందేమీ లేదన్నారు. పెరిగిన హమాలీ కార్మికుల వేతనాలను ఏరి యర్స్‌ రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్య దర్శి లింగయ్య, ఉపాధ్యక్షుడు మిట్టపల్లి పౌలు, లక్ష్మణ్‌, ఖలీందర్‌ ఖాన్‌, దేవి పోచన్న, సంపత్‌, శంకరయ్య, సత్తయ్య, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-26T04:02:25+05:30 IST