గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-17T03:59:57+05:30 IST

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్క రించాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు పీఆర్‌సీ తరహా వేతనాలను హుజూరాబాద్‌ ఎన్నికల సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు.

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు, పంచాయతీ కార్మికులు

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 16: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్క రించాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు పీఆర్‌సీ తరహా వేతనాలను హుజూరాబాద్‌ ఎన్నికల సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు. చాలీచాలని వేతనాలతో పంచాయతీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెరుగుతున్న ధరలతో అప్పులు చేసి జీవిం చాల్సి వస్తుందని, ప్రభుత్వం అందించే సబ్బులు, దుస్తులు, నూనె, బెల్లం, గ్లౌజ్‌లు ఇవ్వలేదన్నారు. జీవో నెంబరు 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, ఆదివారం, పండగలకు సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 3 నెలల వేతనాలను చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రాజలింగు, సాయికృష్ణ, లచ్చన్న, బాణయ్య, సత్త య్య, సుజిత్‌, శంకరయ్య, భూమయ్య, నర్సయ్య,  పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-17T03:59:57+05:30 IST