ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-12T05:08:34+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యలతోపాటు పాఠశాలల విలీన ప్రక్రియను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం పది గంటలకు ఏపీటీఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు తరలివచ్చి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. ఉదయం పదిన్నర సమయంలో పోలీసులు ప్రధాన ద్వారం నుంచి పక్కకు రావాలని పోలీసులు సూచించినా రాకపోవడంతో వారిని పక్కకు పంపే ప్రయత్నం చేశారు. యూనియన్‌ నాయకులు ఎంతకీ కదలక పోవడంతో పోలీసులు బలవంతంగా పక్కకు పంపేందుకు ప్రయత్నాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు (ఇన్‌సెట్లో) ఏపీటీఎఫ్‌ నేతలను నెట్టివేస్తున్న పోలీసులు


కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏపీటీఎఫ్‌

అడ్డుకున్న పోలీసులు, స్వల్ప ఉద్రిక్తత

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 11 : ఉపాధ్యాయుల సమస్యలతోపాటు పాఠశాలల విలీన ప్రక్రియను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం పది గంటలకు ఏపీటీఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు తరలివచ్చి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. ఉదయం పదిన్నర సమయంలో పోలీసులు ప్రధాన ద్వారం నుంచి పక్కకు రావాలని పోలీసులు సూచించినా రాకపోవడంతో వారిని పక్కకు పంపే ప్రయత్నం చేశారు. యూనియన్‌ నాయకులు ఎంతకీ కదలక పోవడంతో పోలీసులు బలవంతంగా పక్కకు పంపేందుకు ప్రయత్నాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం అక్కడ జరిగిన కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం గత 60 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏపీటీఎఫ్‌ ఇచ్చిన 11 డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు.  కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.రఘబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాకా జనార్దన్‌రెడ్డి, డి.శ్రీనివాసులు, ఐ.విజయసారఽథి, ఎల్‌వీ ప్రసాద్‌, వి రవి, టి.సుబ్బారాయుడు, ఎస్‌కే.నాయబ్‌రసూల్‌, బి.శేషారావు, జే.వెంకటేశ్వర్లు, ఎస్‌కే బసీరున్నీసా, పి.హనుమంతరావు, ఎస్‌కే.ఖాదర్‌బాషా, ఎం.యోహాన్‌రెడ్డి, కె.శ్రీనివాసరావు, డి.మరియదాసు, పి.రాజ్‌కుమార్‌, టి.సుబ్బారావు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-12T05:08:34+05:30 IST