ప్రభుత్వం దృష్టికి గ్రామీణ వైద్యుల సమస్యలు

ABN , First Publish Date - 2022-05-22T05:03:34+05:30 IST

గ్రామీణ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వెంకన్న తెలిపారు.

ప్రభుత్వం దృష్టికి గ్రామీణ వైద్యుల సమస్యలు

సంగారెడ్డి అర్బన్‌, మే 21 : గ్రామీణ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వెంకన్న తెలిపారు. సంగారెడ్డిలో శనివారం గ్రామీణ వైద్యుల జిల్లా, మండలాల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్టిఫికేట్‌తో పాటు ట్రైనింగ్‌, గ్రూప్‌ ఇన్సురెన్స్‌ తదితర సమస్యలను సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బాల్‌రాజ్‌, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షుడు గఫర్‌, ప్రధాన కార్యదర్శి సంతోశ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు విఠల్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:03:34+05:30 IST