మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-07T05:54:47+05:30 IST

మున్సిపల్‌ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ టీఎనటీయూసీ హిందూపురం పార్లమెంటరీ ప్రధానకార్యదర్శి గుల్బర్గా షామీర్‌ డిమాండు చేశారు.

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గుల్బర్గా షామీర్‌ తదితరుల నిరసన

టీఎనటీయూసీ పార్లమెంట్‌ ప్రధానకార్యదర్శి షామీర్‌

 పుట్టపర్తిరూరల్‌, జూలై 6: మున్సిపల్‌ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ టీఎనటీయూసీ హిందూపురం పార్లమెంటరీ ప్రధానకార్యదర్శి గుల్బర్గా షామీర్‌ డిమాండు చేశారు. ఈమేరకు బుధ వారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు స్థానిక కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లాకలెక్టర్‌ బసంత కుమార్‌కు వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఆయన విలేకరు లతో మాట్లాడుతూ... దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ కార్మి కుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చా మని తెలిపారు. ఇందులో ప్రధానంగా బకాయిపడిన ఆరు నెలల హెల్త్‌ అలవెన్సును తక్షణమే చెల్లించాలన్నారు, జీతంతో పాటు హెల్త్‌ అలవెన్సు ను ప్రతినెలా చెల్లించాలన్నారు. 60సంవత్సరాలు  నిండిన, మరణించిన కార్మి కుల స్థానంలో వారికుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. మరిణించిన కార్మికులకు మట్టి ఖర్చులు అదేరోజు చెల్లించాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సమస్యలను పరిష్కరించాలన్నారు. వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలన్నారు. మాస్కులు, గ్లౌసులు, చెప్పులు, శానిటైజర్‌ను ఇవ్వా లన్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుంటే ప్రజాఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  టీఎనటీయీసీ  హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు నాగభూషణ, మున్సిపల్‌ మాజీ  చైర్మన బెస్తచలపతి, మైనారిటీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌రఫీ, టీడీపీ జిల్లా  కార్యదర్శి గూడూరు ఓబులేసు, నాయకులు గాజుల రామాంజనేయులు, బాలాంజనేయులు, సాయినాథ్‌, దయ్యాల ఉమాపతియాదవ్‌, తలారిఈశ్వరయ్య, నారాయణస్వామి, సూర్య నారాయణ, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-07T05:54:47+05:30 IST