మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-06T06:32:43+05:30 IST

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొండపల్లి మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కొండపల్లి మున్సిపల్‌ కార్యాలయం వద్ద టీఎన్‌టీయూసీ నేతలు, టీడీపీ కౌన్సిలర్ల నిరసన

టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ ఎదుట ఆందోళన

కొండపల్లి(ఇబ్రహీంపట్నం), జూలై 5: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొండపల్లి మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు డిమాండ్‌ చేశారు. టీఎన్‌టీయూసీ, కొండపల్లి టీడీపీ పట్టణ శాఖ  ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామరాజు మాట్లాడుతూ కార్మికుల వేతనంతో పాటు హెల్త్‌ అలవెన్సులు రూ.6వేలతో పాటు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయాలన్నారు. 60సంవత్సరాలు తరువత తొలగించిన కార్మికుల స్థానంలో కుటుంబసభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు.  పీఎఫ్‌, ఈఎస్‌ఐ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ,  టీడీపీ కౌన్సిలర్లు చుట్టుకుదరు శ్రీనివాసరావు, చుట్టుకుదురు వాసు, కరిమికొండ శ్రీలక్ష్మీ, ముప్పసాని భూలక్ష్మీ, పులి అరుణకుమారి, బాడిశ అంజనాదేవి,  టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి రెంటపల్లి శ్యామ్‌, రాష్ట్ర మాజీ కార్యదర్శి జంపాల సీతారామయ్య,  తదితరులు పాల్గొన్నారు.


11నుంచి మునిసిపల్‌ కార్మికుల సమ్మె

జగ్గయ్యపేట: మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం విధిలేని పరిస్థితుల్లో ఈ నెల 11 నుంచి సమ్మెకు దిగుతున్నట్టు జిల్లా సీఐటీయూ నేత శ్రీనివాస్‌ అన్నారు.  కార్మికులతో  మంగళవారం సమావేశమై మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎలకమ్మ, రంగమ్మ పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T06:32:43+05:30 IST