అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-01T05:14:00+05:30 IST

అంగన్వాడీ వర్కర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఆ వర్కర్ల రాష్ట్ర కౌన్సిలర్‌ నాగేశ్వరి పేర్కొన్నారు. గురువారం లక్కిరెడ్డిపల్లె సీడీపీవో పద్మావతికి సమస్యలు పరిష్కరించాలంటూ విన్నవించారు.

అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
సీడీపీవోకు వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీ వర్కర్లు

లక్కిరెడ్డిపల్లె, జూన్‌ 30: అంగన్వాడీ వర్కర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఆ వర్కర్ల రాష్ట్ర కౌన్సిలర్‌ నాగేశ్వరి పేర్కొన్నారు. గురువారం లక్కిరెడ్డిపల్లె సీడీపీవో పద్మావతికి సమస్యలు పరిష్కరించాలంటూ విన్నవించారు. ఈ సందర్భంగా రిటైర్మెంట్‌ వయస్సు 62కు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీ సిబ్బందికి వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీవర్కర్లు దుర్గా, విజయ్‌కుమారి, సుశీల, పూసంతి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:14:00+05:30 IST