Abn logo
Sep 25 2021 @ 00:24AM

అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు తీర్చాలి

సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీల ర్యాలీ

రేణిగుంట, సెప్టెంబరు 24: అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు తీర్చాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు సాధన, పార్వతి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలో రెవెన్యూ కార్యాలయం వరకు అంగన్‌వాడీలు ర్యాలీ నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. స్కీం వర్కర్లకు కనీసం వేతనం రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈఎ్‌సఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె.హరినాథ్‌, ఒ.వెంకటరమణ, సెల్వరాజ్‌, ఇస్మాయిల్‌, ఈశ్వరి పాల్గొన్నారు. కాగా, స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద స్కీం వర్కర్లు ధర్నా చేశారు. ఏడవ వేతన సంఘ సిఫార్సు మేరకు పాలకప్రభుత్వాలు స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయడంలో విఫలమయ్యాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు విమర్శించారు. కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కె.రాధాకృష్ణ, టి.మునీంద్ర, బి.మోహనరెడ్డి, మణి, కవిత, జహీరా, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.