ఏనుగుల సమస్యను పరిష్కరించాలి: కిసాన్‌ మోర్చా

ABN , First Publish Date - 2022-05-24T06:30:53+05:30 IST

ఏనుగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కిసాన్‌ మోర్చా నాయకులు డిమాండు చేశారు. సోమవారం కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పలమనేరు ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఏనుగుల సమస్యను పరిష్కరించాలి: కిసాన్‌ మోర్చా
పలమనేరు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్త ం చేస్తున్న కిసాన్‌ మోర్చా నాయకులు

 పలమనేరు, మే 23: ఏనుగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని  కిసాన్‌ మోర్చా నాయకులు డిమాండు చేశారు. సోమవారం కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పలమనేరు ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... దశాబ్దాలుగా ఏనుగుల సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏనుగుల సమస్యను పరిష్కరించకపోతే కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం వారు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.  కిసాన్‌ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, కార్యదర్శి ఉమాపతి,  చిట్టిబాబు, క్రిష్ణ, సేతురాఘవులు, చిన్నబ్బ, మార్కొండయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-24T06:30:53+05:30 IST