‘కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ తగదు’

ABN , First Publish Date - 2020-09-24T07:55:26+05:30 IST

భారతీయ తపాలా శాఖలోని వివిధ సేవ లను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభు త్వం చేస్తున్న చర్యలను నిరసిస్తూ అమలా పురం

‘కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ తగదు’

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 23: భారతీయ తపాలా శాఖలోని వివిధ సేవ లను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభు త్వం చేస్తున్న చర్యలను నిరసిస్తూ అమలా పురం ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తపాలా ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి కె.మధుసూధనరావు ము ఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు, కర్షకులతో పాటు తపాలా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపు తుందని ఆవేదన వ్యక్తంచేశారు. తపాలా ఉద్యోగులకు బకా యిపడ్డ డీఏలను వెంటనే విడుదల చేయాలని,  కమలేష్‌చంద్ర కమిటీ సానుకూల సిఫార్సులను అమలు చేయాలని నినాదాలు చేశారు. బుధవారం జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ నాయకులు  కె.సత్తి బాబు, అడపా సత్యనారాయణ, వీవీ.రామ కృష్ణ, ఎ.వెంకటేశ్వర్లు, డీవీ.శర్మ, వి.శ్రీరా ములు, కె.లక్ష్మీప్రసన్న, కృష్ణవేణి, వి.సత్యనారా యణ, కె.శ్రీనివాసరావులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T07:55:26+05:30 IST