నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-28T04:32:36+05:30 IST

పెట్రోలు, డీజీల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు ఐబీ చౌరస్తా అంబేద్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల దేశంలో, రాష్ట్రంలో నిత్యా వసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ధరలను తగ్గిం చని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి
అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు

ఏసీసీ, మే 27: పెట్రోలు, డీజీల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు ఐబీ చౌరస్తా అంబేద్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల దేశంలో, రాష్ట్రంలో నిత్యా వసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ధరలను తగ్గిం చని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గోళ్ల రామన్న, ప్రధాన కార్యదర్శి రాజవేణులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పరస్పర అంగీకార బదిలీలు, పెండింగ్‌లో ఉన్న స్పౌజ్‌ దరఖాస్తు లను పరిష్కరించి ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు జైపాల్‌, తిరుపతి, కిరణ్‌, దిలీప్‌, శ్రీనివాస్‌, వాహిద్‌, జయప్రద, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-28T04:32:36+05:30 IST