పేదలపై ధరల బాదుడు

ABN , First Publish Date - 2022-05-17T05:23:15+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ప్రజ లపై ధరల బారంతో జీవనం కష్టతరం చే సిందని టీడీపీ నేతలు విమర్శించారు.

పేదలపై ధరల బాదుడు
పంగులూరు: జనకవరంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు

 టీడీపీ ధ్వజం

బల్లికురవ, మే 16:  వైసీపీ ప్రభుత్వం ప్రజ లపై ధరల బారంతో జీవనం కష్టతరం చే సిందని టీడీపీ నేతలు విమర్శించారు. సోమ వారం మండలంలోని  కొత్తూరు గ్రామంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశాల మేరకు పెంచిన ధరలపై నిరసనగా బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ సం దర్భంగా టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారం లో ఉన్న సమయంలో ఉన్న ధరలు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పెంచి న ధరలపై కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు.  మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెరిగిన ధరలను తగ్గిస్తారని చెప్పారు.  కార్యక్రమంలో టీడీపీ నేతలు ఇజ్రాయల్‌, కాశీయ్య, హను మంతురావు, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పంగులూరు: అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌, బస్‌ చార్జీల పెంపుతో పాటు అదుపులేని నిత్యావ సర వస్తువుల ధరలతో పేదల నడ్డి విరిచిందని టీడీపీ నేతలు మం డిపడ్డారు. సోమవారం మండలంలోని జనకవరం గ్రామంలో ఇంటిం టికీ కరపత్రాలు పంచుతూ ర్యాలీ నిర్వహించారు. గుర్రం ఆదిశేఖర్‌ నేతృత్వంలో జరిగన కార్యక్రమంలో టీడీపీ మం డల అధ్యక్షుడు రావూరి రమేష్‌, మాజీ జడ్పీ టీసీ కేవీ సుబ్బారావు, మస్తాన్‌వలి, బెల్లంకొండ దశరథ, తలపనేని రాంబాబు, నార్నె సుబ్బా రావు, మాజీ సర్పంచ్‌లు అమృతపూడి ఏసోబు (చిన్నా), ఉన్నం రవిబాబు, యింటూరి పూర్ణ య్య, చౌదరిబాబు తదితరులు పాల్గొన్నారు.


అసమర్ధ పాలనతో రాష్ట్రం అంధకారం

సంతమాగులూరు, మే 16: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అసమర్ధపాలనతో రా ష్ట్రం అంధకారంగా మారిందని టీడీపీ మండల అధ్యక్షుడు గాడిపర్తి వెంకట్రావు తెలిపారు. సోమవారం సాయంత్రం మండలంలోని స జ్జాపురం గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2019కి ముందు రాష్ట్రంలో చంద్రబాబు మిగులు వి ద్యుత్‌తో పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిస్తే, నేడు అప్రకటిత విద్యుత్‌ కోతలతో అంధకారంలోకి తీసుకెళ్ళిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కు తుందన్నారు.  

కార్యక్రమంలో  టీడీపీ నాయకులు దూపాటి ఏసోబు, తేలప్రోలు రమేష్‌, గాడిపర్తి వెంకట్రావు, కొణికి గోవిందమ్మ, గమిడి కోటేశ్వర రావు, పసుపులేటి కోటేశ్వరరావు, గాడిపర్తి రామకృష్ణ,  గొట్టిపాటి నాగేశ్వరరావు, కంచేటి మురళి, శ్యాంబాబు, అనంతవరపు దేవా, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:23:15+05:30 IST