Abn logo
Jul 23 2021 @ 00:25AM

సామాన్యులపై ధరల బాదుడు

- పెట్రో, డీజిల్‌, గ్యాస్‌ ధరలపై ఉద్యమించిన ‘తెలుగు మహిళ’ 

- జగన ప్రభుత్వంపై ఆగ్రహం

హిందూపురం,జూలై 22: ఉప్పు, పప్పు నుంచి అన్ని ధరలను అమాంతంగా పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడిపై ధరలతో చుక్కలు చూపుతోందని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజల్‌, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలంటూ గురువారం తెలుగు మహిళలు టీడీపీ ఆధ్యర్యంలో హిందూపురంలో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా బీకే పార్థపారథి మట్లాడుతూ ఎన్నికలకు ముందు జగనమోహనరెడ్డి చెప్పిన బాదుడే బాదుడు డైలాగ్‌ ఇప్పుడు అమలవుతోందన్నారు. రాష్ట్రంలో ఉప్పు నుంచి పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌, మద్యం దాకా పెంచిన దరలే అందుకు నిదర్శనమన్నారు. రెండేళ్లలో జగన ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం చెంది రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిలా తయారు చేశాడన్నారు. మేధావులు, విద్యార్థులా నిద్రపోవద్దని అందరూ మేల్కొని రాష్ట్ర భవిషత్తును నాశనం చేస్తున్న తుగ్లక్‌ జగనను పదవి నుంచి దించేందుకు రోడ్ల మీదకు వచ్చి పొరాటం చేయాలని పిలుపునిచ్చారు. హిందూపురం పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి సుబ్బరత్రమ్మ, రామసుబ్బమ్మలు మట్లాడుతూ జగన అసమర్థత పనితీరు వల్ల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ డీజల్‌, గ్యాస్‌ ధరలు పెంచుతున్నా ఒక్కమాట అనకుండా రాష్ట్రంలో పన్నులు వేస్తున్నారన్నారు. అంబికా లక్ష్మీనారాయణ మట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యవసర వస్తువుల వల్ల పేద ప్రజలు బతకలేకపోతున్నారని వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా వాహనాలకు తాడు కట్టి లాగుతూ గ్యాస్‌ సిలెండర్లుకు శవయాత్ర చేపడుతూ తహసీల్థార్‌ కార్యాయలం వరకు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పెంచిన ధరలు తగ్గించాలని తహసీల్థార్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శులు రామాంజినమ్మ, కొల్లకుంట అంజినప్ప, షఫీవుల్లా, దేమకేతపల్లి అంజినప్ప, తెలుగు మహిళ సభ్యులు జంగాలపల్లి శోభ, శ్రీదేవి, ధనలక్ష్మీ, లక్ష్మీనరసమ్మ, మాధవి, చెన్నమ్మ, సునంద, కత్తుల సునీత, అనుసూయమ్మ, బేబి, గంగరత్నమ్మ, మాలక్క, జయలక్ష్మి, మండల టీడీపీ కన్వీనర్లు రమేష్‌, అశ్వత్థనారాయణ, జయప్ప. నాయకులు నాగరాజు, అమర్‌నాథ్‌, ఆదినారాయణ, హెచఎం రాము, దుర్గానవీన, హిదాయత, రామాంజనేయులు, సదాశివరెడ్డి, సురేష్‌, శివ, నజీర్‌ అహ్మద్‌, నాగేంద్ర, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.