సిటీ సర్వీసులకు ఆదరణ అంతంతే...

ABN , First Publish Date - 2020-09-22T10:26:36+05:30 IST

నగరంలో సిటీ బస్సులు నడుస్తున్నా వాటిలో ప్రయాణించేందుకు ప్రజలు భయపడుతున్నారు. కరోనా భయంతో ఎక్కువ మంది సొంత వా

సిటీ సర్వీసులకు ఆదరణ అంతంతే...


సోమవారం 31 వేల మంది రాకపోకలు 

30 రూట్లలో 272 సర్వీసులు నడిపిన పీటీడీ  


ద్వారకాబస్‌స్టేషన్‌, సెప్టెంబరు 21: నగరంలో సిటీ బస్సులు నడుస్తున్నా వాటిలో ప్రయాణించేందుకు ప్రజలు భయపడుతున్నారు. కరోనా భయంతో ఎక్కువ మంది సొంత వాహనాలనే వినియోగిస్తుండడంతో సిటీ సర్వీసులకు ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. సోమవారం నగరంలో ఎంపిక చేసిన 30 రూట్లలో 272 సిటీ బస్సులు ఆపరేట్‌ చేసినా కేవలం 31 వేల మంది మాత్రమే వాటిలో ప్రయాణించినట్టు అధికారులు లెక్కలుగట్టారు.  సగటు ఆక్యుపెన్సీ 26 శాతంగా నమోదయింది. 


రోజువారీ ఆదాయం రూ.6 లక్షలు వచ్చింది. కొవిడ్‌ ప్రభావానికి ముందు సిటీలో రోజుకు 580 సర్వీసులు నడవగా, సగటున 3 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. 76 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదయ్యేది. రోజువారీ ఆదాయం సుమారు రూ.57 లక్షలుండేది. అప్పటితో పోల్చుకుంటే కేవలం 10 శాతం మాత్రమే ఆదాయం వస్తోందని పీటీడీ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-09-22T10:26:36+05:30 IST