మిస్సింగ్‌ కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-05-29T05:21:05+05:30 IST

సుమారు రెండేళ్ల కిందట కన్పిం చకుండా పోయిన మహిళ మిస్సింగ్‌ కేసును పోలీసులు ఛే దించారు.

మిస్సింగ్‌ కేసును ఛేదించిన పోలీసులు
నిందితులతో డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌, సీఐ హనుమంతనాయక్‌

రెండేళ్లుగా కనిపించని మహిళ శవం వెలికితీత

ఏడుగురు అరెస్టు

బద్వేలు రూరల్‌, మే 28: సుమారు రెండేళ్ల కిందట కన్పిం చకుండా పోయిన మహిళ మిస్సింగ్‌ కేసును పోలీసులు ఛే దించారు. శనివారం రూరల్‌ సీఐ కార్యాలయంలో విలేకరుల కు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌ అందించిన సమాచారం మేరకు వివరాల్లోకెళితే.... 2020లో కుటుంబ విభేధాలతో మల్లంపేట వాసి గొల్లా రామసుబ్బమ్మ పుట్టిల్లు సిద్ధవటం మండలం జ్యో తి గొల్లపల్లికి చేరింది. అయితే అదే గ్రామానికి  చెందిన జ్యోతి  రామకృష్ణారెడ్డి పొలంలో పందులు, అటవీ జంతువు లు రాకుండా ఉండేందుకు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యు త్‌ తీగలు తగిలి ఆమె చనిపోయిందన్నారు.

ఈసంఘటన తనమీదకు రాకుండా ఉండేందుకు సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు మృతురాలి శవాన్ని రామకృష్ణారెడ్డి మరికొందరి తో కలిసి  పెన్నానదిలో పూడ్చారని డీఎస్పీ వివరించారు. ఇ టీవల ఎస్పీ ఆదేశాల మేరకు మిస్సింగ్‌ కేసులను ఛేందించేందుకు రూరల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక టీ మ్‌ శ్రమించింది. చివరికి మిస్సింగ్‌ కేసును ఛేదించి మృతికి కారణం, శవాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించారు. ఇందు లో నిందితులుగా జ్యోతి రామకృష్ణారెడ్డి సహా బోగిళ్ల లక్ష్మ య్య, జ్యోతి వెంకటయ్య, కంబంకొండయ్య, జ్యోతి వెంకటరమణ, కానాల వెంకటసుబ్బయ్య, పిల్లి సుబ్బరాయుడును అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మొత్తం వివ రాలు తెలపడంతో వారిని అరెస్టు చేశామని ఆయన తెలిపా రు. మిస్సింగ్‌ కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్‌ సీఐ హనుమంతనాయక్‌, ఎస్‌ఐ చంద్రశేఖర్‌, ఏఎ్‌సఐ రాజశేఖర్‌రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది రామ్‌భూపాల్‌రెడ్డి, నాగేంద్ర, తదితరులను ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2022-05-29T05:21:05+05:30 IST