Advertisement
Advertisement
Abn logo
Advertisement

హత్య కేసును చేధించిన పోలీసులు

నెల్లూరు: నగరంలో గత ఏడాది సంచలనం సృష్టించిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును నవాపేట పోలీసులు చేధించారు. ఈ కేసులో నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడిని ముక్తియర్‌గా పోలీసులు గుర్తించారు. ముక్తియర్‌పై పలు స్టేషన్లో 100 పై గా దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ముక్తియర్‌ చెల్లెలు, ఆమె భర్త, వారి పిల్లలే కలిసి అతడిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. ముక్తియర్‌ వేధింపులు తట్టుకోలేక హత్య చేశామని ముద్దాయిలు ఒప్పుకున్నారని నగర డీఎస్పీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. 


నెల్లూరులోని పెన్నానది బ్రిడ్జి కింద ప్లాస్టిక్ గోతపు సంచులో గుర్తు తెలియని శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలంలో శవాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మృతుడిని ముక్తియర్‌గా పోలీసులు గుర్తించారు. 

Advertisement
Advertisement